టీవీ సిరీస్‌లో చూసి నేర్చుకుని, మూడేళ్ల కూతురిని చంపి.. ఆ చిన్నారి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పారేసింది ఓ మహిళ. ప్రియుడి మోజులో పడి కూతురిని అడ్డువదిలించుకోవాలని ఆమె ఈ దారుణానికి పాల్పడింది. తమ ప్రాణాలు ఇచ్చయినా సరే బిడ్డలను కాపాడుకుంటారు తల్లులు. కానీ, ఈ తల్లి మాత్రం అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది.
ఇంతటి క్రూరత్వానికి పాల్పడాలన్న ఐడియా ఆమెకు టీవీ సిరీస్ ‘క్రైమ్ పట్రోల్’ నుంచి వచ్చింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సూట్‌కేస్‌లో మూడేళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ విషయం బయటపడింది.
నిందితురాలు కాజల్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని, భర్తను వదిలించుకోవాలన్న దుర్బుద్ధితో ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. ఆమె ప్రియుడు ఆమె కుమార్తెతో పాటు ఉండడానికి ఇష్టపడలేదని పోలీసులు గుర్తించారు. చిన్నారి గొంతు కోసిన తల్లి ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పొదల్లోకి విసిరేసిందని చెప్పారు. ఇంట్లో రక్తపు మరకలు కనపడకుండా కడిగేసిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Also Read: హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భద్రత పెంపు.. ఇంటివద్ద పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు