Vennela Death Case: అమ్మ ప్రేమకంటే అక్రమ సంబంధమే ఎక్కువైందా? కన్నకూతురిని కాటేసిన కసాయి తల్లి.. ప్రియుడితో విలాసాల కోసం
ప్రియుడి కోసం ఆరేళ్ల కుమార్తె వెన్నెల(Vennela Death Case)ను చంపిన బెంగళూరు తల్లి.
bengaluru mother kills six year old daughter for lover
- ప్రియుడి కోసం కన్నబిడ్డను చంపేసింది.
- పుట్టినరోజే పసిపాపకు ఆఖరి రోజైంది.
- తండ్రి పోరాటంతో వెలుగులోకి ఘోరం.
Vennela Death Case: కన్నప్రేమను మరిచి, కట్టుకున్నవాడిని వదిలేసి, మోహంలో మునిగిపోయిన ఒక తల్లి కన్నకూతురి పాలిట కాలయమురాలైంది. తన స్వార్థ సుఖాలకు అడ్డంగా ఉందని భావించి ఆరేళ్ల పసిప్రాణాన్ని చిదిమేసిన ఈ ఘోర కలియుగ ఉదంతం బెంగళూరు(Bengaluru)లో వెలుగుచూసింది. లాయర్ అయిన ప్రియాంక అనే మహిళ, తన ప్రియుడు మోహన్‌తో కలిసి కన్నకూతురు వెన్నెలను దారుణంగా హత్య చేసి, దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. మార్చి 25న ఈ దారుణం జరగ్గా, బాలిక తండ్రి ప్రవీణ్ బసప్ప పోరాటంతో జూన్ 4న కడుగోడి పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రియుడిని అరెస్ట్ చేయగా, ప్రియాంక ప్రస్తుతం పరారీలో ఉంది.
Andhra Premier League Schedule: IPL అయిపోయింది.. APL వచ్చేసింది.. ఈ నెల్లోనే.. ఫ్రీగా చూడాలంటే..
వివరాల్లోకి వెళితే, దావణగెరెకు చెందిన ఉపాధ్యాయుడు ప్రవీణ్ కు ప్రియాంకతో 2007లో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే, 2025 చివరిలో ఆస్తి గొడవలపై బెంగళూరు వచ్చిన ప్రియాంక, అక్కడ తన పాత ప్రేమికుడు మోహన్‌కు దగ్గరైంది. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుని దుబాయ్‌లో విలాసాలు చేశారు. ఆ తర్వాత భర్తను బెదిరించి విడాకులు తీసుకుని, పెద్ద కుమార్తెను తండ్రి వద్దే వదిలేసి, చిన్న కుమార్తె వెన్నెల(Vennela Death Case)ను తీసుకుని బెంగళూరులోని సీగేహళ్లిలో ప్రియుడితో కలిసి ఉంటోంది ప్రియాంక. ఈ క్రమంలోనే మార్చి 24న వెన్నెల పుట్టినరోజు కాగా, ఆ చిన్నారికి బిర్యానీ, ఐస్‌క్రీమ్ తినిపించి, కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపుచ్చి మోహన్ తో కలిసి ప్రియాంక కాఫీ షాప్‌నకు వెళ్ళింది.
మరుసటి రోజు ఉదయం బాలిక స్పృహ తప్పి ఉండటంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, చిన్నారి మృతిపై అనుమానం వచ్చిన తండ్రి ప్రవీణ్ పోస్ట్‌మార్టం నివేదికను బ్రిటన్‌లో పీడియాట్రీషియన్‌గా పనిచేస్తున్న తన సోదరి డాక్టర్ పూర్ణిమకు చూపించారు. ఆ నివేదికలో తీవ్ర వ్యత్యాసాలు ఉండటంతో ఇది ముమ్మాటికీ హత్యేనని గుర్తించింది. తమ అక్రమ సంబంధానికి అడ్డంగా ఉందన్నా కారణంగానే వెన్నెలను ఊపిరాడకుండా చేసైనా లేదా విషం ఇచ్చైనా చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు బెయిల్ పొందిన మోహన్ బెయిల్‌ను రద్దు చేయించి పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రియాంక కోసం గాలిస్తున్నారు.
