Samsung Galaxy A35 5G : ఏంది భయ్యా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ మరి ఇంత తక్కువా?
Samsung Galaxy A35 5G : శాంసంగ్ లవర్స్ కోసం మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ35 5జీ ఫోన్ ఏకంగా రూ. 14వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A35 5G : శాంసంగ్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఎప్పటినుంచో తక్కువ ధరలో మంచి శాంసంగ్ ఫోన్ కొనాలని చూసేవారికి ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ35 5జీ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది.

వాస్తవానికి, ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. హై-ఎండ్ మిడ్-రేంజ్ ఫోన్ ఇప్పుడు రూ. 20వేల కన్నా తక్కువకే లభిస్తోంది.

మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఈ అదిరే డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 5జీ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ రూ. 32,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 18,999కి తగ్గింది. ప్రారంభ ధరతో పోలిస్తే రూ. 14వేల కన్నా ఎక్కువగా డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో ధర ఇంకా తగ్గుతుంది.

ఇందులో రూ. 950 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. 36 నెలల వరకు అంటే.. నెలకు రూ. 668 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ బెటర్ ఆప్షన్. పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ఈ ఫోన్ రూ. 13,250 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A35 5జీ కొనాలా? వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ అద్భుతమైన డీల్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ స్క్రీన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్నెస్, 1,900 నిట్స్ అందిస్తుంది. ఇందులో ఆక్టా-కోర్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్లతో పాటు 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ పొందవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వినియోగించుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A35 ధరకు దగ్గరగా ఉంటే వన్‌ప్లస్ నార్డ్ 5, నథింగ్ ఫోన్ (3a) ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వివో V50 ఫోన్లలో కూడా ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్లలో కూడా కొత్త ప్రాసెసర్లు, అద్భుతమైన కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్, సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉన్నాయి.
