Ed Raids On Attica Gold: అట్టికా గోల్డ్‌పై ఈడీ సంచలన దాడులు.. ఏకకాలంలో 16 ప్రాంతాల్లో.. భారీగా బంగారం, విదేశీ కరెన్సీ సీజ్!
‘అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్(Ed Raids On Attica Gold)’ అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపారు.
ED raids on Attica Gold company offices in money laundering case.
Ed Raids On Attica Gold: దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టించిన ‘అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్(Ed Raids On Attica Gold)’ అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని మొత్తం 16 కీలక ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయాలు, శాఖలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, షేర్హోల్డర్లు, పూర్వపు డైరెక్టర్లు, అనుబంధ సంస్థల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి.
దొంగ బంగారం కొనుగోలు – బయటపడిన మనీలాండరింగ్ నెట్వర్క్:
వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు తమ దర్యాప్తును తీవ్రతరం చేశారు. దొంగతనం చేసిన బంగారాన్ని అట్టికా గోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తూ, ఆ అక్రమ మార్గాల ద్వారా భారీగా నేర ఆదాయాన్ని సమకూర్చుకుందనే ప్రధాన ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, దీని వెనుక ఉన్న హవాలా మార్గాలు ఏమిటి, ఈ ఆర్థిక అక్రమాలు ఎంతవరకు వ్యాపించాయనే కోణంలో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.
విదేశీ కరెన్సీ, పసిడి స్వాధీనం – కీలక డైరెక్టర్ల పరారీ:
రెండు రోజుల పాటు సాగిన ఈ సోదాల్లో రూ. 7.52 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను ఈడీ అధికారులు జప్తు చేశారు. అయితే, సోదాల సమయంలో కంపెనీ కీలక సూత్రధారులు పి.ఎస్. ఆయుబ్ (బొమ్మనహళ్లి బాబు), ఒబేదుల్లా, సల్మాన్ తదితరులు విచారణకు సహకరించకుండా పరారయ్యారు. సిబ్బందిని సైతం అందుబాటులో ఉండవద్దని ఆదేశించినట్లు గుర్తించిన అధికారులు, ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల కోసం గాలింపు వేగవంతం చేశారు.
