Bank Holidays In October 2026 : అక్టోబర్లో మీకు బ్యాంకు పని ఉందా? 11 రోజులు బ్యాంకులు బంద్.. ఫుల్ హాలిడే లిస్టు ఇదే..!
Bank Holidays In October 2026 : అక్టోబర్లో బ్యాంకులు 11 రోజుల పాటు మూతపడనున్నాయి. మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోండి. ఆర్బిఐ బ్యాంకు సెలవుల లిస్టును ఓసారి చెక్ చేసుకోండి.
Bank Holidays In October 2026
Bank Holidays In October 2026 : అక్టోబర్లో మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉన్నాయా? అయితే, ఇది మీకోసమే.. పండుగలు రాష్ట్ర సెలవుల కారణంగా ఈ నెలలో బ్యాంకు శాఖలు మొత్తంగా 11 రోజుల పాటు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో సెలవులు ఉండనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు ఒకేలా ఉండవు. గాంధీ జయంతి నుంచి దసరా దుర్గా పూజ వరకు అనేక పండుగలు ఈ నెలలో రానున్నాయి.
అంతేకాదు.. ఆదివారాలు నెల రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. సెలవు దినాల్లో యూపీఐ, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే, మీరు క్యాష్ డిపాజిట్ చేయడం, చెక్కులు, లేదా ఇతర బ్యాంకు శాఖ సంబంధిత పనులను ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్.
అక్టోబర్ 2న బ్యాంకులకు సెలవు :
అక్టోబర్ నెలలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. జాతీయ సెలవుదినం రోజున మీకు ఏవైనా అత్యవసరమైన బ్యాంకింగ్ పనులు ఉంటే వాటిని అంతకన్నా ముందే రోజే పూర్తి చేసుకోవడం బెటర్. ఆ తర్వాత, సెలవులు ప్రధానంగా వివిధ రాష్ట్రాలు, నగరాలలో జరుపుకునే పండుగల ఆధారంగా మారుతాయి.
పలు రాష్ట్రాల్లో దుర్గా పూజ :
అక్టోబర్ మూడో వారంలో మరిన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. అగర్తలా, ఐజ్వాల్, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, ఇంఫాల్, కోల్కతా, పాట్నా, రాంచీ షిల్లాంగ్తో సహా అనేక ప్రాంతాల్లో దసరా కారణంగా అక్టోబర్ 19న బ్యాంకులు మూతపడతాయి.
గాంగ్టక్ ఇంఫాల్ అక్టోబర్ 20న మూతపడతాయి. అగర్తలా, బెంగళూరు, గాంగ్టక్, గౌహతి, కొచ్చి, కోల్కతా తిరువనంతపురంలో అక్టోబర్ 21న బ్యాంకులు మూతపడతాయి. దుర్గా పూజ కారణంగా సిక్కింలోని గాంగ్టక్లో అక్టోబర్ 22, అక్టోబర్ 23 తేదీలలో కూడా బ్యాంకులు మూతపడతాయి. అయితే, రాష్ట్రం నగరాన్ని బట్టి సెలవు తేదీలు మారవచ్చు.
బ్యాంకు సెలవుల జాబితా :
- 2 అక్టోబర్ : మహాత్మా గాంధీ జయంతి (దేశవ్యాప్తంగా)
- 10 అక్టోబర్ : మహాలయ అమావాస్య (బెంగళూరు, కోల్కతా)
- 17 అక్టోబర్ : మహా సప్తమి (అగర్తలా)
- 19 అక్టోబర్ : దసరా (అనేక నగరాల్లో)
- 20 అక్టోబర్ : దసరా/మహానవమి/ఆయుధ పూజ/దుర్గాపూజ (గ్యాంగ్టక్, ఇంఫాల్)
- 21 అక్టోబర్ : విజయదశమి/దుర్గా పూజ (అనేక నగరాల్లో)
- 22 అక్టోబర్ : దుర్గా పూజ
- 23 అక్టోబర్ : దుర్గా పూజ గ్యాంగ్టక్
- 26 అక్టోబర్ : లక్ష్మీ పూజ/అభిషేక దినోత్సవం/వాల్మీకి జయంతి (కొన్ని నగరాల్లో)
- 29 అక్టోబర్ : కర్వా చౌత్ (సిమ్లా)
- 31 అక్టోబర్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)
బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులంటే? :
పండుగలతో పాటు అక్టోబర్లో సాధారణ వారంతపు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలు ఆదివారాలు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూతపడతాయి. అదనంగా, అక్టోబర్ 10వ తేదీ రెండో శనివారం, అక్టోబర్ 24వ తేదీ నాల్గో శనివారం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఈ రెండు రోజులలో బ్యాంకులు మూతపడతాయి. అక్టోబర్లో అనేక ప్రాంతాలలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఉండొచ్చు.
అక్టోబర్ 26 నుంచి సమ్మె.. :
బ్యాంకు వినియోగదారులు అక్టోబర్ నెలాఖరులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) అక్టోబర్ 26, 2026 నుంచి నిరవధిక సమ్మెను ప్రకటించింది.
ఈ సమ్మె జరిగితే బ్యాంకు శాఖల కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చు. అయితే, బ్యాంకులు మూతపడినా సమ్మె జరిగినా కూడా యూపీఐ, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర పనుల కోసం డిజిటల్ బ్యాంకింగ్ వినియోగించుకోవచ్చు.
