Crocodile: నదిలో స్నానానికి వెళ్లిన బాలుడు.. మింగేసిన మొసలి

ఉదయం పూట బాలుడు చంబల్ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మొసలి బాలుడిని లోపలికి లాక్కుని వెళ్లి, తినేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Crocodile: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన పదేళ్ల బాలుడిని మొసలి మింగేసింది. షియోపూర్ జిల్లాలోని చంబల్ నదిలో ఈ ఘటన సోమవారం జరిగింది. ఉదయం పూట బాలుడు చంబల్ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మొసలి బాలుడిని లోపలికి లాక్కుని వెళ్లి, తినేసింది.

Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మొసలి కోసం గాలించారు. కర్రలు, వల, తాడు వంటివాటితో మొసలిని వేటాడి బంధించారు. దాన్ని ఒడ్డుకు లాక్కొచ్చి, కట్టిపడేశారు. ఈ ఘటన సమచారం అందుకున్న మొసలి సంరక్షణాధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తుల దాడి నుంచి మొసలిని రక్షించేందుకు ప్రయత్నించారు. దీనికి బాలుడి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మొసలి కడుపులో బాలుడు బతికే ఉంటాడని, అందుకే మొసలిని నీటిలోకి వదిలేందుకు ఒప్పుకోమని అన్నారు.

Cute Charge: ‘క్యూట్ చార్జి’ వసూలు చేస్తున్న ఇండిగో.. నెటిజన్ల జోకులు

మొసలిని చంపేందుకు ప్రయత్నించారు. తన కడుపులో ఉన్న బాలుడిని బయటకు తీస్తేనే, మొసలిని వదిలిపెడతామని చెప్పారు. అయితే, మొసలి మింగేయడం వల్ల బాలుడు మరణించిన విషయాన్ని పోలీసులు, అధికారులు కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చెప్పారు. ఎలాగోలా కుటుంబ సభ్యులను ఒప్పించడంతో మొసలిని వదిలిపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు