తుపాను ప్రభావం.. ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం

ఈ నెల 26న అర్థరాత్రి బంగ్లాదేశ్-వెస్ట్ బెంగాల్ కు ఆనుకుని ఉన్న ఖెపురా వద్ద తీవ్ర తుపానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది.

Ap Rains : దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రాబోతున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నెల 26న అర్థరాత్రి బంగ్లాదేశ్-వెస్ట్ బెంగాల్ కు ఆనుకుని ఉన్న ఖెపురా వద్ద తీవ్ర తుపానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read : యుద్ధ మేఘాలు.. విశ్వశాంతికి ముప్పుగా మారిన పరిస్థితులు ఇవే..

ట్రెండింగ్ వార్తలు