కేదార్‌నాథ్‌లో తప్పిన పెను ప్రమాదం.. నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Kedarnath Helicopter : ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయంతో హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్రజలు పరుగులు తీశారు. అప్రమత్తమైన పైలెట్ హెలిప్యాడ్ పక్కన ఉన్న కొండ ప్రాంతంలో ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

హెలికాప్టర్ లో ఏడు మంది ఉన్నారు. వారిలో ఒకరు పైలట్ కాగా ఆరుగురు ప్రయాణికులు. హెలిపాడ్ కి సరిగ్గా 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. గాల్లో గింగిరాలు తిరిగింది. ఏం జరుగుతుందో అర్థం కాక అందులోని ప్రయాణికులు, హెలిప్యాడ్ దగ్గర ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. హెలికాప్టర్ ఎక్కడ క్రాష్ అవుతుందోనని భయాందోళనకు గురయ్యారు. అయితే,
పైలట్ చాక్యచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

కెస్టర్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్.. ఆరుగురు ప్రయాణికులతో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్ నాథ్ దామ్ కు బయలుదేరింది. కేథార్ నాథ్ ధామ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయానికి నియంత్రణ కోల్పోయింది. ఇలా జరగడానికి టెక్నికల్ ఫాల్ట్ కారణం అని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది చార్ దామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. తొలుత గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాత్ క్షేత్రాలు తెరుచుకున్నాయి. మే 12న బద్రీనాథ్ క్షేత్రం తెరుచుకుంది. ఈ యాత్రను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏప్రిల్ – మే నెలలో ప్రారంభమై అక్టోబర్ – నవంబర్ నెలలో ముగుస్తుంది. తొలుత యమునోత్రిలో యాత్రను ప్రారంభిస్తారు. గంగోత్రి, కేదార్ నాథ్ మీదుగా యాత్ర సాగిస్తారు. చివరగా బద్రీనాథ్ క్షేత్రం దర్శనంతో చార్ దామ్ యాత్ర ముగుస్తుంది. చార్ దామ్ యాత్రకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దాంతో రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రిషికేష్ లో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దాంతో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న యాత్రికులను మాత్రమే చాద్ దామ్ యాత్రకు అనుమతిస్తారు అధికారులు.

 

ట్రెండింగ్ వార్తలు