Virat Kohli : ఐపీఎల్ నుంచి ఆర్‌సీబీ ఔట్‌.. విరాట్ కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

ఐపీఎల్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం ఊసూరుమ‌నిపించ‌డం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు అల‌వాటుగా మారింది.

Virat Kohli – RCB : ఐపీఎల్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం ఊసూరుమ‌నిపించ‌డం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు అల‌వాటుగా మారింది. ఎంత మంది స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ.. మూడు సార్లు ఫైన‌ల్ చేరినా స‌రే ఒక్క‌సారి కూడా బెంగ‌ళూరు క‌ప్పును కొట్ట‌లేదు. 17వ సీజ‌న్‌లోనూ ఆ జ‌ట్టు కోరిక నెర‌వేర‌లేదు.

ఈ సీజన్‌ను ఆర్‌సీబీ ఓట‌మితో మొద‌లు పెట్టింది. మొద‌టి మ్యాచ్‌లో చెన్నైతో ఓట‌మి పాలైంది. అయితే.. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. దీంతో ఆర్‌సీబీ ఫామ్ అందుకుని ఈ సీజ‌న్‌లో మొద‌టి గెలుపును రుచి చూసింద‌ని ఆ జ‌ట్టు అభిమానులు సంతోషించారు. వారి ఆనందం ఎక్కువ రోజులు లేదు. వ‌రుస‌గా ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. ఎనిమిది మ్యాచులు ముగిసే స‌రికి ఒక్క మ్యాచులో గెలిచింది. ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది.

Riyan Parag : ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డు దిశ‌గా రియాన్ ప‌రాగ్‌.. హైద‌రాబాద్ బౌల‌ర్లు అడ్డుకునేనా?

దీంతో ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ క‌థ ముగిసింద‌ని అంతా భావించారు. క‌నీసం ఒక్క‌రు కూడా ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని అనుకుని ఉండ‌రు. అయితే.. ఈ ద‌శ‌లో ఆర్‌సీబీ అద్భుత‌మే చేసింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అదే ఊపులో ఆర్‌సీబీ క‌ప్ కొడుతుంద‌ని ఆ జ‌ట్టు అభిమానులు కోటి ఆశ‌ల‌ను పెట్టుకున్నారు. అయితే.. ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఓడిపోయి ఈ సీజ‌న్ నుంచి నిష్ర్క‌మించింది.

ఓట‌మి త‌రువాత తొలిసారి కోహ్లి పోస్ట్..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఓట‌మి త‌రువాత విరాట్ కోహ్లి సోష‌ల్ మీడియాలో తొలి పోస్ట్‌ను పెట్టాడు. అభిమానులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. ‘అభిమానులంద‌రికీ మ‌రోసారి థ్యాంక్యూ. మ‌మ్మ‌ల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు. ఎల్ల‌వేళ‌లా ప్రోత్స‌హిస్తున్నందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

USA v BAN : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు బంగ్లాదేశ్ ప‌రువు పాయె..! స‌వాల్ విసురుతున్న అమెరికా

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో కోహ్లి ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఓ శ‌త‌కం, ఐదు అర్థ‌శ‌త‌కాల‌తో దుమ్ములేపాడు. 15 మ్యాచుల్లో 61.75 స‌గ‌టుతో 741 బాది టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు