Riyan Parag : ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డు దిశ‌గా రియాన్ ప‌రాగ్‌.. హైద‌రాబాద్ బౌల‌ర్లు అడ్డుకునేనా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ చెల‌రేగి ఆడుతున్నాడు.

Riyan Parag : ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డు దిశ‌గా రియాన్ ప‌రాగ్‌.. హైద‌రాబాద్ బౌల‌ర్లు అడ్డుకునేనా?

Riyan Parag

Riyan Parag Needs 59 Runs : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ చెల‌రేగి ఆడుతున్నాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు ఎవ‌రైనా స‌రే దంచికొడుతూ నిల‌క‌డ‌గా ప‌రుగులు సాధిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 15 మ్యాచులు ఆడిన అత‌డు 567 ప‌రుగులు చేశాడు. రెండో క్వాలిఫ‌య‌ర్‌లో శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో రియాన్ ప‌రాగ్‌ అరుదైన రికార్డు సాధించే అవ‌కాశం ఉంది.

స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ప‌రాగ్ మ‌రో 59 ప‌రుగులు చేస్తే ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ గా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు య‌శ‌స్వి జైస్వాల్ పేరిట ఉంది. 2023 ఐపీఎల్ సీజ‌న్‌లో జైస్వాల్ 625 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి కంటే ముందు అ రికార్డు షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2008లో 11 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ త‌రుపున మార్ష్ 616 ప‌రుగులు చేశాడు.

Ambati Rayudu : ఆర్‌సీబీ పై అంబ‌టి రాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల వ‌ల్ల‌నే..

ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వీరే..
– య‌శ‌స్వి జైస్వాల్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 2023లో 625 ప‌రుగులు
– షాన్ మార్ష్ (పంజాబ్ కింగ్స్‌) – 2008లో 616 ప‌రుగులు
– రియాన్ ప‌రాగ్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 2024లో 567 ప‌రుగులు
– ఇషాన్ కిష‌న్ (ముంబై ఇండియ‌న్స్‌) – 2020లో 516 ప‌రుగులు
– సూర్య‌కుమార్ యాద‌వ్ (ముంబై ఇండియ‌న్స్‌) – 2018లో 512 ప‌రుగులు