Ambati Rayudu : ఆర్‌సీబీ పై అంబ‌టి రాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల వ‌ల్ల‌నే..

చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు అంబ‌టి రాయుడు మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు.

Ambati Rayudu : ఆర్‌సీబీ పై అంబ‌టి రాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల వ‌ల్ల‌నే..

Ambati Rayudu attack on RCB Leaders prioritising individual milestones

Ambati Rayudu-RCB : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్థాన్ రాజ‌ల్స్ చేతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఓడిపోయింది. దీంతో ఆర్‌సీబీ ఇంటి ముఖం ప‌ట్టింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు జ‌ట్టు పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు పై కామెంట్లు చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు అంబ‌టి రాయుడు మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. కెప్టెన్లు, మేనేజ్‌మెంట్‌ను విమ‌ర్శించిన‌ప్ప‌టికీ.. ఆ జ‌ట్టు అభిమానుల పై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఒక్క‌సారి కూడా క‌ప్పును ముద్దాడ పోయినా కూడా టోర్నీ ఆరంభం నుంచి ఆర్‌సీబీ జ‌ట్టును అభిమానులు ప్రేమిస్తూ వ‌స్తున్నార‌న్నాడు. అందుక‌నే ఆర్‌సీబీ జ‌ట్టును అభిమానించే ప్ర‌తి ఫ్యాన్స్‌కు అభినంద‌లు తెలియ‌జేశాడు. కాగా.. మేనేజ్‌మెంట్‌తో పాటు ఆ జ‌ట్టు కెప్టెన్లు మాత్రం వ్య‌క్తిగ‌త మైలురాళ్ల‌కే ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నార‌ని ఆరోపించాడు.

USA v BAN : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు బంగ్లాదేశ్ ప‌రువు పాయె..! స‌వాల్ విసురుతున్న అమెరికా

ఇలా కాకుండా జ‌ట్టు గురించి ఆలోచించి ఉంటే ఇప్ప‌టికే ఆర్‌సీబీ ఎన్నో టైటిళ్లు సొంతం చేసుకునేది చెప్పుకొచ్చాడు. ఇప్ప‌టికైనా టీమ్ మేనేజ్‌మెంట్ మేల్కొనాల‌ని, జ‌ట్టు కోసం ఆడే ప్లేయ‌ర్ల‌ను తీసుకోవాల‌ని సూచించాడు. మెగా వేలం నుంచి ఆర్‌సీబీ కొత్త చాప్ట‌ర్ ఘ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు రాయుడు ట్వీట్ చేశాడు.

ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ ప్ర‌ద‌ర్శ‌న ప‌డి లేచిన కెర‌టంలా ఉంది. తొలి ఎనిమిది మ్యాచుల్లో ఒక్క మ్యాచుల్లోనే గెలిచింది. దీంతో టోర్నీ నుంచి నిష్ర్క‌మించే ప‌రిస్థితికి చేరుకుంది. ఈ ద‌శ‌లో ఎంతో గొప్ప‌గా ఆ జ‌ట్టు పుంజుకుంది. వ‌రుస‌గా ఆరు మ్యాచుల్లో గెలిచింది. లీగు ద‌శ‌లో ఆఖ‌రి మ్యాచులో చెన్నై పై ఘ‌న విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే.. ప్లేఆఫ్స్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఓట‌మి పాలైంది.

MS Dhoni : ఫేస్‌బుక్‌లో ధోని పోస్ట్ వైర‌ల్‌.. ‘స‌మ‌యం ఆస‌న్న‌మైంది..’ రిటైర్‌మెంట్ పై హింట్ ఇచ్చాడా?