Odisha : ఒడిశా బాలాసోర్ లో మరో ఘటన.. రైలులో చెలరేగిన మంటలు

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్ లో చెలరేగిన మంటలను ఫైరింజన్లతో ఆర్పివేశారు.

goods train

Goods Train Fire : ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాద ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్ కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. ఈ క్రమంలో ఒక గూడ్స్ వ్యాగన్ నుంచి పొగలు, మంటలు రావడాన్ని రైల్వే స్టేషన్ సిబ్బంది గమనించింది.

మంటలు ఇతర వ్యాగన్లకు వ్యాపించుకుండా ఉండేందుకు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్ లో చెలరేగిన మంటలను ఫైరింజన్లతో ఆర్పివేశారు. ఆ తర్వాత అంతా బాగానే ఉందని నిర్ధారించిన రైల్వే అధికారులు గూడ్స్ రైలును అక్కడి నుంచి గమ్య స్థానానికి వెళ్లేందుకు అనుమతించారు.

Karnataka: ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లేనట.. ముహూర్తం ముందు అసలు విషయం చెప్పిన కర్ణాటక సర్కార్

బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలులో మంటలు ఎలా వ్యాపించాయన్నది తెలియలేదు.
కాగా, గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్ని బాలాసోర్ జిల్లాలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. గూడ్స్ రైలులో చెలరేగిన మంటలను ఆర్పి వేసేందుకు వేగంగా స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు