IT Raids : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు

గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

IT Raids : గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడు కనుమ అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. కనుమ.. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలు చూస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది.

రెండు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ముస్తాఫా మొదటి నుంచి కూడా పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. పొగాకు వ్యాపారం తర్వాత పూర్తిగా రాజకీయాలు చేస్తున్నారు. తన కూతురును కూడా రాజకీయ ఆరంగేట్రం చేయిస్తున్నారు. దీంతో ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ముస్తాఫా వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా అతని సోదరుడు కనుమ చూసుకుంటున్నాడు.

IT Raids In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు

పొగాకు ఎగుమతితో అతనికి సంబంధాలున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి వీరంతా పొగాకు వ్యాపారంలో ఆరితేరి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఐటీ అధికారులు రెండు బృందాలుగా వచ్చారు. కనుమను ఇంట్లోనే ఉంచి సోదాలు చేస్తున్నారు. అయితే ముస్తాఫా తనయుడి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు