Eggs : ప్రొటీన్ బ్యాంక్..కోడిగుడ్డు

గుడ్డును తీసుకోవటం వల్ల మన శరీరానికి క్యాలరీల 70శాతం ఉంటాయి. ఈ క్యాలరీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి.

Eggs : ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ప్రతిరోజు తమ ఆహారంలో ఒక కోడిగుడ్డు తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు..గుడ్డు మంచి పౌష్టికారం.. ఇందులో ప్రొటీన్లు సంవృద్ధిగా లభిస్తాయి. అందుకే కోడి గుడ్డును ప్రొటీన్ బ్యాంకుగా అభివర్ణిస్తారు. దీనిని అన్ని వయస్సుల వారు ఆహారంలో బాగంగా తీసుకోవచ్చు.

గుడ్డును తీసుకోవటం వల్ల మన శరీరానికి క్యాలరీల 70శాతం ఉంటాయి. ఈ క్యాలరీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన కొవ్వులు, ఇనుము విటమిన్లు, మినరల్స్, కెరటినాయిడ్స్,అమైనో అమ్లాలు, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, బి6, బి12, ఫోలేట్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కోడి గుడ్డు తినటం వల్ల బరువు పెరిగిపోతారని చాలా మంది అపోహపడుతుంటారు. అయితే వాస్తవానికి కోడి గుడ్డు బరువు తగ్గటానికి దోహదపడుతుంది.

అంతేకాదు వ్యాయామం చేసేవారు కోడిగుడ్డు తినటం వల్ల వారి కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. ప్రతిరోజు రెండు గుడ్లను తీసుకోవటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంపుదలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. గుండెజబ్బులవంటి సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

కోడిగుడ్డును మన ఆహారంగా ఏరూపంలో తీసుకున్నా ఒకే విధమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొంత మంది అమ్లెట్ రూపంలో తినేందుకు ఇష్టపడతుండగా, మరికొందరు ఉడికించి, ఇకొందరు పచ్చి గుడ్లను తీసుకునేందుకు ఇష్టపడతారు.

ట్రెండింగ్ వార్తలు