పోలింగ్ శాతం పెరగడానికి కారణమిదే, విదేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం- మంత్రి పెద్దిరెడ్డి

4వ తేదీన ఎన్నికల ఫలితాల తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.

Peddireddy Ramachandra Reddy : వైసీపీ నేతలు విదేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ట్విట్టర్ లో మాపై లోకేశ్ తప్పుడు పోస్టులు పెడుతున్నారని సీరియస్ అయ్యారు. లోకేశ్ ఓ మూర్ఖుడు.. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు. ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమ.. కనీసం సీటు తెచ్చుకోలేకపోయారని విమర్శించారు.

”2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారాలు చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకి పంపిస్తున్నాము. మొదటి విడత 20 వాహనాలు బాంబే పోర్ట్ నుంచి షిప్ లో పంపిస్తున్నాం. మాకు విదేశాల్లో ఫెర్రో మాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాము. మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాం. మేము విదేశాలకు పారిపోతున్నాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

4వ తేదీన ఎన్నికల ఫలితాలు తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. మేము చేసిన సంక్షేమ పథకాలు వల్లే పోలింగ్ శాతం పెరిగింది. 4న రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం. పోలింగ్ శాతం పెరగటానికి మహిళలే కారణం. మా ఐ ప్యాక్ టీమ్ ఇదే చెప్పింది. అందరి కృషి వల్లే మేము ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధిస్తున్నాం. చంద్రబాబు ఒత్తిడి వల్లే పోలింగ్ అనంతరం ఘర్షణలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది. మొదటి నుంచి అదే మాట చెబుతున్నా” అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Also Read : అమెరికా వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎందుకంటే?

 

 

ట్రెండింగ్ వార్తలు