NASA Moon Railway : మూన్‌ రైల్వేకు నాసా బృహత్తర ప్రయత్నం

NASA Moon Railway : అల్లంత దూరంలో ఉన్న చంద్రుణ్ని చూసి ఒకప్పుడు మనిషి.. చందమామ రావే.. జాబిల్లి రావే..అని పాటలు పాడుకున్నాడు. చందమామ అంటే మనకి అందనిది అన్న అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు.

A railway will be built on Moon

NASA Moon Railway : చుక్.. చుక్.. చుక్.. మంటూ చందమామపై రైలు వెళ్తే ఎలా ఉంటుంది..? జాబిల్లిపై మెట్రో పరుగులు తీస్తుంటే..ఆ ట్రైన్‌లో మనం ఉంటే కలిగే అనుభూతి ఏంటి…? ఎక్కడో అల్లంత దూరంలో..మనకు అందని అందంలా ఉండే చందమామపై మనం ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రయాణిస్తుంటే ఏమనిపిస్తుంది..? ఈ ఊహలన్నీ నిజం కాబోతున్నాయి. జాబిల్లిని మనిషికి మరో ఆవాసంగా మార్చేందుకు పోటీపడుతున్న పరిశోధనాసంస్థలు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. చంద్రుని దక్షిణభాగంపై రోవర్‌ను దింపి.. జాబిల్లిపై ప్రయోగాలకు కొత్త మార్గం ఏర్పరించింది ఇస్రో. ఈ స్ఫూర్తితో ప్రపంచ దేశాలు జాబిల్లిపై మరిన్ని పరిశోధనలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే నాసా చందమామపై రైలును తిప్పేందుకు ప్రణాళికలు వేసింది. చంద్రునిపై తొలి రైల్వేస్టేషన్ నింపేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.

అల్లంత దూరంలో ఉన్న చంద్రుణ్ని చూసి ఒకప్పుడు మనిషి.. చందమామ రావే.. జాబిల్లి రావే..అని పాటలు పాడుకున్నాడు. చందమామ అంటే మనకి అందనిది అన్న అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు. చేయిచాచి చందమామను పిలిచి..అది కావాలని మారాం చేసే చిన్నారికి.. అద్దంలో చూపి…మాయపుచ్చాడు. చల్లని వెన్నెల కురిపించే చంద్రుని లోతులను దూరం నుంచే కొలిచేందుకు ప్రయత్నించాడు. నిండు జాబిలిపై మచ్చల గురించి రకరకాల కథలు చెప్పుకుని సర్దిచెప్పుకున్నాడు. అర్ధచంద్రాకారం పూర్ణబింబంలా మారే కాలం కోసం ఎదురుచూస్తూ జీవనగమనాన్ని కొనసాగించాడు.

జాబిల్లి గురించి, చంద్రుణ్ని గురించి రకరకాల కథలు చెప్పుకుంటూనే…పరిశోధనలు కొనసాగించాడు మనిషి. ప్రచ్చన్నయుద్ధకాలంలో రష్యా, అమెరికాకు ఇది ప్రతిష్టాత్మక అంశంగా మారిపోయింది. ఈ పరిశోధనలు ఫలించి 1969 జూలై 20న అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపాడు. ఆ క్షణమే చంద్రునిపై పరిశోధనలు కీలక మలుపు తిరిగాయి. జాబిల్లిపై మనిషి నివాసం ఏర్పరుచుకోవచ్చన్న నమ్మకం మొదలయింది. అనేక దేశాలు వరుసగా చంద్రునిపై ప్రయోగాలు చేపట్టాయి. అయితే అనుకున్నంత వేగంగా ఈ పరిశోధనలు జరగలేదు. 2009లో చంద్రయాన్ -1 ప్రయోగం విజయవంతం కావడం, చంద్రునిపై నీళ్ల అవశేషాలు ఉన్నాయని ఇస్రో పరిశోధనల్లో తేలడంతో మరోసారి ప్రపంచ దేశాల దృష్టి జాబిల్లిపై పడింది.

చంద్రునిపై మనిషి జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. మళ్లీ విస్తృత పరిశోధనలు మొదలయ్యాయి. అమెరికాతో పాటు రష్యా, చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాలన్నీ చందమామపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ప్రపంచ దేశాలేవీ సాధించలేనివిధంగా చంద్రుని దక్షిణ ధృవంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రయివేట్ మూన్ ల్యాండర్‌ను చంద్రునిపై పరిశోధనల కోసం ప్రయోగించింది.

ఇప్పుడు చంద్రుణిపై మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు వడివడిగా ప్రయోగాలు జరుగుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత నాసా మళ్లీ జాబిల్లిపై మనుషులను పంపే ప్రయోగాలకు రంగం సిద్దం చేస్తోంది. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కింద అమెరికా ఈ ప్రయోగాలు చేపడుతోంది. చంద్రయాన్ 3లో ప్రజ్ఞాన్ రోవర్‌ను జాబిల్లిపై దిగ్విజియంగా దింపిన ఇస్రో…చంద్రయాన్ 4లో… రోవర్ జాబిల్లిపైదిగి..అక్కడున్న రాళ్లు, మట్టి తిరిగి తీసుకొచ్చేలా ప్రయోగం చేపట్టనుంది. 2040నాటికి చంద్రయాన్ 4ను ప్రయోగించాలన్నది ఇస్రో లక్ష్యంగా ఉంది.

ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి పరిస్థితుల్లోలా ఇప్పుడు చంద్రునిపై ప్రయోగాలు అన్నిదేశాలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒక దేశం మించి మరో దేశం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పుడు అన్ని దేశాల లక్ష్యం చంద్రునిపై మనిషి జీవించేలా వనరులు కల్పించడం. ఈ రేసులో ముందుండేందుకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ పోటీపడుతున్నాయి. ఒకప్పుడు చంద్రునిపై అడుగుపెట్టడానికి అమెరికా, రష్యా ఎలా పోటీపడ్డాయో.. చంద్రునిపై కాలనీలు ఏర్పరచడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడలా పోటీపడుతున్నాయి. అమెరికా, చైనా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించగా.. భవిష్యత్తులో రష్యా కూడా ఈ రేసులో పాల్గొనే అవకాశముంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వంటి ప్రయివేట్ సంస్థలూ
పోటీపడుతున్నాయి.

చంద్రునిపై నివసించాలంటే భూమ్మీద ఉన్న అన్ని సౌకర్యాలూ ఉండాలి. సాంకేతికత సాయంతో ఈ సౌకర్యాల కల్పనపై ప్రపంచ దేశాలు దృష్టిపెడుతున్నాయి. ఆ దిశగా నాసా కీలక ప్రణాళిక రచించింది. చుక్ చుక్‌ చుక్ రైలు మోత చంద్రునిపై వినిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మనిషి స్థిరనివాసం ఏర్పరచుకునేలోపు జాబిల్లిపై వ్యోమగాములకు సహకారమందించేలా మొట్టమొదటి రైల్వేస్టేషన్ నిర్మాణానికి ప్రయోగాలు చేపట్టనుంది. రిలయబుల్, అటానమస్, ఎఫిషయంట్ పేలోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ అందించేందుకు రోబోటిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ సిద్ధం చేస్తోంది. ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా ఈ రైల్వేస్టేషన్ ఏర్పాటుచేయనుంది.

Read Also : Realme Buds Wireless 3 Neo : రియల్‌మి GT 6టీతో బడ్స్ వైర్‌లెస్ 3 నియో వస్తోంది.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు