US Military Base: అమెరికా ఎయిర్ బేస్‌లో పౌడర్ కలకలం.. అస్వస్థతకు గురైన సైనికులు.. ఏంటా పౌడర్..
పార్సిల్ వచ్చిన ప్యాక్ లో తెల్లటి పొడి ఉంది. అదేంటో తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు.
US Military Base: అమెరికాలోని మేరీల్యాండ్ మిలిటరీ ఎయిర్‌బేస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ పౌడర్ కారణంగా సైనికులు అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్ బేస్‌కు ఒక పార్శిల్ వచ్చింది. అదేంటో చూద్దామని సిబ్బంది ఆ పార్సిల్ ను ఓపెన్ చేశారు. అందులో పౌడర్ బయటపడింది. దాని పీల్చిన వారు అస్వస్థతకు గురయ్యారు. పలువురు సైనికులు స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. ముందు జాగ్రత్తగా ఆ బ్లాక్‌ను సీల్ చేశారు. అలాగే సమీప భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. అసలా పౌడర్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? సైనికులు స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటి? అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది.
”గురువారం వాషింగ్టన్ సమీపంలోని సైనిక స్థావరానికి అనుమానాస్పద ప్యాకేజీ వచ్చింది. దాన్ని ఓపెన్ చేశాక పలువురు అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోయారు. దీనిపై దర్యాప్తు ప్రారంభమైంది. అనుమానాస్పద ప్యాకేజీ కారణంగా మేరీల్యాండ్ సైట్‌లోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించారు” అని అధికారులు తెలిపారు. కాగా, అధ్యక్ష విమానాల కోసం ఈ స్థావరాన్ని ఉపయోగిస్తారు. ముందు జాగ్రత్త చర్యగా భవనంలోని వారిని ఖాళీ చేయించారు అధికారులు.
”పార్సిల్ వచ్చిన ప్యాక్ లో తెల్లటి పొడి ఉంది. అదేంటో తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఎయిర్ బేస్ అమెరికా రాజధానికి కొద్ది దూరంలో ఉంది. దీన్ని తరచుగా సీనియర్ ప్రభుత్వ అధికారులు విమానాల కోసం ఉపయోగిస్తారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఫ్లోరిడాలోని ఒక వ్యాపార వేదిక నుండి తిరిగి వస్తుండగా దీన్ని సందర్శించారు” అని అధికారులు వెల్లడించారు.
Also Read: భారత్ పర్యటనకు ట్రంప్.. మోదీపై ప్రశంసల వర్షం.. ఇక రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లను..
