Bandi sanjay on family planning surgery: రికార్డు కోసమే గంటకు 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు: బండి సంజయ్

ఆపరేషన్ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదని బండి సంజయ్ అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల నలుగురు మహిళలు చనిపోయారని, వారి మృతి తెలంగాణ సర్కారే కారణమని ఆరోపించారు. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించుకుండా సీఎం కేసీఆర్ బిహార్ వెళ్ళారని ఆయన చెప్పారు.

Bandi sanjay on family planning surgery: రికార్డు కోసమే తెలంగాణలో గంటలకు 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న మహిళల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపుతోంది. అలాగే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని వికటించిన వారిలో కొందరు హైదరాబాద్, జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్ వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదని అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల నలుగురు మహిళలు చనిపోయారని, వారి మృతి తెలంగాణ సర్కారే కారణమని ఆరోపించారు.

కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించుకుండా సీఎం కేసీఆర్ బిహార్ వెళ్ళారని ఆయన చెప్పారు. కాగా, టుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న మహిళల్లో నలుగురు మృతి చెందడం పట్ల ప్రతిపక్ష పార్టీల నేతలు సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మంత్రి హరీశ్ రావును ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

COVID-19: దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు.. నిన్న 22,50,854 వ్యాక్సిన్ డోసుల వినియోగం

ట్రెండింగ్ వార్తలు