IndiGo: జీతాల పెంపు కోసం నిరసన.. సిక్ లీవులో ఇండిగో సిబ్బంది

జీతాల పెంపు కోరుతూ, యాజమాన్యంపై నిరసనగా భారీ స్థాయిలో ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టారు. అందులోనూ హైదరాబాద్, ఢిల్లీకి చెందిన సిబ్బందే ఎక్కువగా సిక్ లీవ్ పెట్టినట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది.

IndiGo: ఈ నెల 2న ఇండిగో సంస్థకు చెందిన దాదాపు 55 శాతం విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి. కారణం.. ఈ సంస్థకు చెందిన చాలామంది క్యాబిన్ క్రూ, టెక్నికల్ స్టాఫ్ సిక్ లీవ్ పెట్టడమే. ఉన్నట్లుండి ఇంతమంది సిక్ లీవ్ పెట్టడం వెనుక కారణం ఉంది. వీళ్లంతా నిజంగా అనారోగ్యానికి గురై సిక్ లీవ్ పెట్టలేదు.

Andhra Pilgrims: అమర్‌నాథ్‌లో 84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం

జీతాల పెంపు కోరుతూ, యాజమాన్యంపై నిరసనగా భారీ స్థాయిలో ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టారు. అందులోనూ హైదరాబాద్, ఢిల్లీకి చెందిన సిబ్బందే ఎక్కువగా సిక్ లీవ్ పెట్టినట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. చాలా కాలంగా పనిచేస్తున్న తమకు తక్కువ జీతాలు ఇస్తుండటంతో సిబ్బందిలో ఎక్కువ మంది లీవ్ పెట్టారు. దీంతో ఇటీవల డొమెస్టిక్ విమానాలు ఆలస్యమయ్యాయి. కోవిడ్ సమయంలో అనేక సంస్థలతోపాటు ఇండిగో కూడా వేతనాల్లో భారీగా కోత విధించింది. అయితే, ఈ మధ్య కాలంలో.. కొత్తగా రానున్న ఆకాశ ఎయిర్‌తోపాటు, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు జీతాల్ని భారీగా అందిస్తున్నాయి.

Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

దీంతో తమకు కూడా జీతాలు పెంచాలని ఇండిగో సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చాలా మంది ఇండిగో సిబ్బంది ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు కూడా హాజరైనట్లు తెలిసింది. అయితే, ఈ నిరసనలపై ఇండిగో సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు.

ట్రెండింగ్ వార్తలు