Krishnamma : ఏంది బ్రో.. థియేటర్స్‌లో రిలీజయిన ఏడు రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ప్రేక్షకుల విమర్శలు..

ఇలా బ్రేక్ ఈవెన్ అయిందో లేదో అలా ఓటీటీ లోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది కృష్ణమ్మ సినిమా.

Satya Dev Krishnamma Movie Streaming in OTT just completed 7 days Theatrical Release

Krishnamma Movie : సత్యదేవ్(Satya Dev) హీరోగా కృష్ణమ్మ అనే సినిమాతో ఇటీవల మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది ఈ సినిమా. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణమ్మ సినిమా తెరకెక్కింది. అథిరా రాజ్, అర్చన, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ, రఘు కుంచె.. పలువురు ముఖ్య పాత్రలతో క్రైమ్ రివెంజ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

కృష్ణమ్మ సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ వచ్చినా రొటీన్ స్టోరీ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే సినిమాలేవీ లేకపోవడంతో కలిసొచ్చి ఏకంగా 5.40 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయింది. ఇలా బ్రేక్ ఈవెన్ అయిందో లేదో అలా ఓటీటీ లోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నేడు మే 17 నుంచి కృష్ణమ్మ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Producers Council : థియేటర్స్ బంద్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన

ఇటీవల ఎంత ఫ్లాప్ సినిమా అయినా కనీసం రెండు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ కృష్ణమ్మ సినిమా రిలీజయిన ఏడు రోజుల్లోనే ఓటీటీలోకి రావడంతో ఓ పక్క ఆశ్చర్యపోతూనే మరో పక్క విమర్శలు చేస్తున్నారు. ఈ మాత్రం దానికి థియేటర్ కి ఎందుకు రిలీజ్ చేసారు, ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది కదా. నిన్నే సినిమా థియేటర్లో చూసాను, ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది డబ్బులు లాస్.. అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇటీవల క్లోజ్ చేస్తున్నాము అని చెప్పడంతో ఎలాగో థియేటర్స్ లేవు కాబట్టి ఓటీటీకి ఇచ్చేస్తే బెటర్ అని నిర్మాతలు అనుకోని ఉంటారని సమాచారం.

ఇక కృష్ణమ్మ కథ విషయానికొస్తే.. భద్ర(సత్యదేవ్), కోటి(లక్ష్మణ్ మీసాల), శివ(కృష్ణతేజ) ముగ్గురు అనాధలు, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. విజయవాడ వించిపేట మనుషులు ఎవరో కేసులను డబ్బులు తీసుకొని మీదేసుకొని జైలుకు వెళ్లొస్తుంటారు. అలాంటి ఏరియాలో దాసన్న దగ్గర గంజాయి తీసుకురావడం లాంటి కొన్ని క్రిమినల్ పనులు చేస్తూ భద్ర, కోటి బతుకుతుంటే శివ ఓ ప్రింటింగ్ షాప్ పెట్టుకుంటాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పటికైనా ఒక ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటారు. అలాంటి వీళ్ళ లైఫ్ లోకి మీనా(అథిరా రాజ్) రావడంతో శివ, మీనా ప్రేమలో పడటం, భద్రని అన్నయ్య అనడం.. ఇలా హ్యాపీగా లైఫ్ సాగిపోతున్న టైంలో మీనాకు ఓ కష్టం వస్తుంది. అదే టైంలో భద్ర, శివ, కోటిలను ఓ కేసులో అరెస్ట్ చేస్తారు. అసలు మీనాకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఏ కేసులో అరెస్ట్ చేసారు? దాన్నుంచి బయటకు వచ్చారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.