Producers Council : థియేటర్స్ బంద్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన
థియేటర్ల బంద్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది.

Bandh of theatres from tomorrow producers council key announcement
థియేటర్ల బంద్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు చార్జీలు చెల్లించలేకపోతున్నారని కారణాన్ని చూపుతూ సినిమా థియేటర్లను మూసివేస్తున్న విషమం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారం ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శన రద్దు చేయడమైనది అంటూ బోర్డులు పెడుతున్నారు. ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా తక్కువ ఫుట్ఫాల్ల కారణంగా జరిగింది. ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు నుండి ఏ గ్రూప్ గాని, సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కావునా థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియజేస్తున్నాం. ఇది తక్కువ వసూళ్లు వస్తుండడంతో థియేటర్లను మూసివేత కొందరు థియేటర్ యజమానుల వ్యక్తిగత నిర్ణయం. ఇందుకు సంబంధించి పైన పేర్కొన్న అన్ని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.