Viral Video: మెట్రో రైల్లో ఊగుతూ, డ్యాన్స్ చేస్తూ అమ్మాయి రచ్చ రచ్చ

మెట్రో రైల్లో హ్యాండ్రైల్స్ పట్టుకుని ఊగుతూ, ఆ తర్వాత డ్యాన్స్ చేస్తూ, సీసీ కెమెరాకు హాయ్ చెబుతూ ఓ అమ్మాయి రచ్చ రచ్చ చేసింది. ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించకూడదు. అయితే, కొందరు మాత్రం ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్లో తాజాగా చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను అపర్ణ దేవయాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ లో చూడొచ్చు.

Viral Video: మెట్రో రైల్లో హ్యాండ్రైల్స్ పట్టుకుని ఊగుతూ, ఆ తర్వాత డ్యాన్స్ చేస్తూ, సీసీ కెమెరాకు హాయ్ చెబుతూ ఓ అమ్మాయి రచ్చ రచ్చ చేసింది. ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. అయితే, కొందరు మాత్రం ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్లో తాజాగా చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను అపర్ణ దేవయాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ లో చూడొచ్చు.

మొదటి హ్యాండ్రైల్స్ పట్టుకుని ఊగింది ఆ అమ్మాయి. ఆ సమయంలో మరొకరు వీడియో తీశారు. అనంతరం ఓ బొమ్మను పట్టుకుని ఆ అమ్మాయి విచిత్రంగా ప్రవర్తించింది. మెట్రో ట్రైనులో ఉండే సీసీ కెమెరాకు కూడా తాను భయపడబోననే విధంగా దానికి హాయ్ చెప్పింది. ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.

మెట్రో ట్రైనులో ప్రయాణికులు కూర్చునే సీటుపైనే ఈ పనులన్నీ చేసింది. అక్కడితోనూ ఆగకుండా సీట్లపై నిలబడి డ్యాన్స్ చేసింది. వృద్ధులు, అంగవైకల్యులకు మెట్రో ట్రైన్ లో కేటాయించే సీట్లలో కూర్చొని ఆమె ఈ పని చేసింది. ఆ యువతి చేష్టలను ఆమె స్నేహితురాలు వీడియో తీస్తోన్న దృశ్యం ఆమె వెనుక ఉన్న అద్దంలో చూడొచ్చు.

మెట్రో ట్రైనులో అత్యుత్సాహం ప్రదర్శించిన అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ మెట్రోలోనూ ఓ అమ్మాయి డ్యాన్స్ చేసి అనంతరం చిక్కుల్లో పడింది.

Airtel 5G Services : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మరో రెండు నగరాల్లోకి.. ఇదిగో ఫుల్ లిస్ట్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు