పోలింగ్ తర్వాత మాట మార్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి ఇది పరాకాష్ట- హరీశ్ రావు

ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబినెట్ నిర్ణయం పునః సమీక్షించుకోవాలని, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందని, రైతులను దగా చేసిందని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

”యాసంగిలో దొడ్డు వడ్లు మాత్రమే తెలంగాణలో పండతాయి. బోనస్ ఇవ్వమని కాంగ్రెస్ ఎగబెట్టుతుంది. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తింది. బోనస్ హామీని కాంగ్రెస్ నెరవేర్చాలి. ధాన్యానికి బోనస్ అని ఆనాడు కొర్రీలు పెట్టలేదు. బోనస్ ఇవ్వాలంటే 6వేల కోట్లు అవసరం. 500 కోట్లతో సరిపెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. రైతు భరోసా ఇవ్వలేదు. రైతు బంధు మాత్రమే ఇచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకుకు 2,500 బాకీ పడింది. జూన్ నాటికి రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నాము. కాంగ్రెస్ ఎగవేత ధోరణి అవలభిస్తోంది. మిగిలిన పంటల పైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైతుల తరపున మేము పోరాటం చేస్తాము. భట్టి మాటలన్నీ వట్టి మాటలని తేలిపోయింది. పోలింగ్ తర్వాత దొడ్డు వడ్లకే బోనస్ అని ప్రకటించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు రైతులు వడ్లు అమ్ముకుంటున్నారు.

కాగా.. ధాన్యం కొనుగోళ్లపై డ్రైవర్ తో లైవ్ లో మాట్లాడారు హరీశ్ రావు. తోటయిపల్లి నుంచి బెజ్జంకి రైస్ మిల్లుకు ధాన్యం తీసుకురాగా.. నిన్నటి నుంచి ధాన్యం దించుకోవడం లేదని డ్రైవర్ చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబినెట్ నిర్ణయం పునః సమీక్షించుకోవాలని, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులను అదుకునే చర్యలు చెపట్టాలన్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు వీరేనా? త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..!

ట్రెండింగ్ వార్తలు