Vivo Y200 Pro 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? యాంటీ షేక్ కెమెరాతో వివో Y200 ప్రో 5జీ ఫోన్.. భారత్‌లో ధర ఎంతంటే?

Vivo Y200 Pro 5G Launch : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లోఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 64ఎంపీ యాంటీ-షేక్ కెమెరా కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్‌లో ఇదే హైలైట్ ఫీచర్ అని చెప్పవచ్చు. 

Vivo Y200 Pro 5G launched in India ( Image Credit : Google )

Vivo Y200 Pro 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త వివో వై200 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ వివో సెగ్మెంట్‌లో అత్యంత సన్నని 3డి కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

Read Also : Infinix GT 20 Pro 5G Launch : ఇన్ఫినిక్స్ జీటీ20 ప్రో 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే?

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లోఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 64ఎంపీ యాంటీ-షేక్ కెమెరా కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్‌లో ఇదే హైలైట్ ఫీచర్ అని చెప్పవచ్చు. అంతేకాదు.. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. సింగిల్ స్టోరేజ్ ర్యామ్ ఆప్షన్ కలిగి ఉంది. వివో Y200 ప్రో 5జీ ఫోన్ అన్ని వివరాలను ఓసారి లుక్కేయండి.

వివో వై200 ప్రో 5జీ : ధర ఎంతంటే? :
వివో Y200 ప్రో 5జీ ఫోన్ సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో ఏకైక వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.24,999కు పొందవచ్చు. వివో Y200 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్లు, వివో పార్టనర్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

వివో వై200ప్రో 5జీ ఫోన్ కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా ప్రకటించింది. ఎస్బీఐ కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, కొనుగోలుదారులు రూ. 2,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. దాంతో ఈ వివో ఫోన్ ధర రూ.22,499కి తగ్గుతుంది.

వివో Y200ప్రో 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
వివో Y200 ప్రో 5జీ ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో 6.78-అంగుళాల అమోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ 172 గ్రాముల బరువు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో “కుషనింగ్ స్ట్రక్చర్” ఉందని వివో పేర్కొంది. ఈ డివైజ్ “స్క్రీన్ షేటర్-రెసిస్టెంట్”గా చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఓఐఎస్‌తో కూడిన 64ఎంపీ యాంటీ-షేక్ కెమెరాను కలిగి ఉంది.

కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఫ్లాగ్‌షిప్-స్టాండర్డ్ ఓఐఎస్ మాడ్యూల్ కెమెరా షేక్‌లను తగ్గిస్తుంది. తక్కువ కాంతిలోనూ తీసిన ఫొటోల క్వాలిటీని మెరుగుపరుస్తుంది. ఫొటోలలో వివరాలను స్పష్టంగా కనిపించేలా చేస్తుందని వివో పేర్కొంది. వివో వై200 ప్రో 5జీ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. కానీ, వివో రెండో కెమెరా వివరాలను వెల్లడించలేదు.

వివో Y200 ప్రో 5జీ ఫోన్ శక్తినిచ్చేది 6ఎన్ఎమ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌టెండడ్ ర్యామ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. మరో 8జీబీ ర్యామ్ కలిగి ఉంది. వివో యూజర్లకు 16జీబీ ర్యామ్ స్పీడ్ అందజేస్తుందని పేర్కొంది. వివో Y200 ప్రో 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్టు అందిస్తుంది. వివో ఫోన్ 4 ఏళ్ల బ్యాటరీ గ్యారెంటీ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. కంపెనీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వివో గ్రేటర్ నోయిడాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసినట్లు వివో వెల్లడించింది.

Read Also : Naga Chaitanya : నాగచైతన్య కొత్త కారు భలే ఉందిగా.. ఈ లగ్జరీ స్పోర్ట్స్ మోడల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు