100 Planets Jupiter : బృహస్పతి కన్నా 100కుపైగా అతిపెద్ద గ్రహాలు ఇవిగో.. పెద్ద స్టార్ లేకుండానే తిరుగుతున్నాయట..!

ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఎన్ని అంటే చెప్పగలరా? లెక్కేసి చెబుతాం అంటారా? కుదరదు.. మనకు కనిపించే గ్రహాల కన్నా కనిపించని గ్రహాలెన్నో అంతరిక్షంలో నిక్షిప్తమై ఉన్నాయి.

100 planets Bigger than Jupiter : ఆకాశంలో ఎన్ని గ్రహాలు.. అంటే చెప్పగలరా? లెక్కేసి చెబుతాం అంటారా? కుదరదు.. మనకు కనిపించే గ్రహాల కన్నా కనిపించని గ్రహాలెన్నో అంతరిక్షంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఖగోళ విశ్వాన్ని ఎంతగా ఛేదించినా అంతుపట్టని రహస్యాలెన్నో దాగి ఉన్నాయనేది అక్షర సత్యం.. అలాంటి అద్భుతమైన ఖగోళంలో నుంచి కొత్త గ్రహాలు వందలాది పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని అందరికి తెలుసు.. అయితే గ్రహాలు మాత్రం ఒక నక్షత్రాన్ని కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయని అంటారు.. అయినప్పటికీ, మాతృ నక్షత్రం (Parent Star) లేని 70 నుంచి 172 వరకు అతిపెద్ద గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి మాత్రమే సూర్యుని చుట్టు తిరుగుతుంటే.. ఇతర గ్రహాలు మాత్రం నక్షత్రం చుట్టు పరిభ్రమిస్తుంటాయి. గ్రహాల్లో అన్నింటికన్నా పెద్ద గ్రహం.. బృహస్పతి (గురుగ్రహం).. ఇప్పుడా బృహస్పతి కన్నా అతిపెద్ద గ్రహాలు వందకు పైగా ఉన్నాయని అంతరిక్ష వ్యోమగాములు కనుగొన్నారు. ఆ గ్రహాలు ఏ నక్షత్రం సాయం లేకుండా వాటంతటవే స్వేచ్ఛగా తిరుగుతున్నాయని గుర్తించారు. ఈ గ్రహాల సముదాయాన్ని సైంటిస్టులు ఒకేసారి కనుగొన్నారు.

వీటిని ఫ్రీ-ఫ్లోటింగ్ గ్రహాల అతిపెద్ద నమూనాగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు తెలిసిన ఫ్రీ-ఫ్లోటింగ్ గ్రహాల సంఖ్య కన్నా దాదాపు రెట్టింపుగా ఉంటాయని అంటున్నారు. స్వేచ్ఛగా పరిభ్రమించే గ్రహాలు దాదాపు నక్షత్రాల నిర్మాణ ప్రక్రియ ఆధారంగా తిరుగుతాయట.. అయితే కొత్తగా కనుగొన్న ఈ గ్రహాల మూలం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ గ్రహాలు బృహస్పతి ద్రవ్యరాశి కన్నా 13 రెట్లు తక్కువ ద్రవ్యరాశి కలిగిన ఖగోళ వస్తువులుగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ గ్రహాలు నక్షత్రానికి లోబడి పరిభ్రమించవు. కానీ, నక్షత్రాల మధ్య తిరుగుతుంటాయట.. వాయువు, చిన్న మేఘాల గురుత్వాకర్షణ కోల్పోవడం ద్వారా నక్షత్రాల వలె ఏర్పడతాయా లేదా నక్షత్రాల చుట్టూ గ్రహాలలాగా ఏర్పడతాయా?వంటి ప్రశ్నలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

దీనికి సంబంధించి అధ్యయనాన్ని నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ఖగోళ శాస్త్రవేత్తలు ప్రచురించారు. ఈ స్వేచ్ఛగా తేలుతున్న గ్రహాల ఏర్పాటుకు గ్రహ వ్యవస్థల నుంచి విచ్ఛిన్నమే కారణం అయి ఉండొచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గ్రహాలను ఎగువ స్కార్పియస్ యంగ్ స్టెల్లార్ అసోసియేషన్‌లో చూశారు. సూర్యుడికి దగ్గరగా నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాలవి.. ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న అన్నింటి ఖగోళ వస్తువుల ఫొటోలను ఖగోళ శాస్త్రవేత్తలు సేకరించారు. 80,000 వైడ్-ఫీల్డ్ ఫొటోలను సేకరించారు. దీనికి సంబంధించి అతిపెద్ద పరిశీలనల జాబితాను రూపొందించారు. స్వేచ్ఛగా తేలియాడే గ్రహాలను గుర్తించడం అనేది ఒక పెద్ద సవాలు వంటిదగా సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఈ అధ్యయనంలో కనుగొన్న ఫ్రీ-ఫ్లోటింగ్ గ్రహాలు తదుపరి అధ్యయనాలకు చాలా ప్రయోజనకరమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో.. కొత్తగా కనుగొన్న ఈ వందలాది గ్రహాల సముదాయం అధ్యయనం చేయడానికి ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే.. ఆ గ్రహాల వాతావరణం నక్షత్రం లేకుండానే ఏర్పడింది. నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణంతో పోలిస్తే.. వాటి నిర్మాణం, లక్షణాలకు సంబంధించి కీలక వివరాలను అధ్యయనం చేయొచ్చునని ఖగోళ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : New Year 2022 GST : కొత్త ఏడాది కొత్త ధరలు..ఇక చెప్పులు, దుస్తులు కాస్ట్లీ

ట్రెండింగ్ వార్తలు