Russia Ukraine War : రష్యాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. 14 రష్యన్ కంపెనీలపై ఆంక్షలు..

ఉక్రెయిన్ పై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండిస్తున్న, పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా ప్రధాని పుతిన్ ...

Russia Ukraine War :  ఉక్రెయిన్ పై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండిస్తున్న, పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా ప్రధాని పుతిన్ తన నిర్ణయాన్ని మార్చుకోవటం లేదు. ఇప్పటికే అమెరికాతో సహా అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. భార‌త్‌కు చెందిన ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ కూడా ఇదే బాట‌లో న‌డిచింది. ర‌ష్యాలో త‌న ఐటీ కార్య‌కలాపాల‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా ఇన్ఫోసిస్ బుధవారం సాయంత్రం ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కార‌ణంగానే ర‌ష్యాలో ఐటీ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేస్తున్న‌ట్లుగా ఇన్ఫోసిస్ ప్ర‌క‌ట‌న చేసింది. సంస్థ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ర‌ష్యాలో ఇన్ఫోసిస్ కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి.

Russia ukraine war : అత్యాచారాలను కూడా రష్యా ఆయుధాలుగా వాడుతోంది..ఐరాసకు వెల్లడించిన యుక్రెయిన్

తాజాగా ఆ జాబితాలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా చేరింది. ఇప్పటికే పలు రంగాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా.. ఉక్రెయిన్ నుండి తమ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాకు సూచించింది. ఇదే క్రమంలో 14 రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలే లక్ష్యంగా ఆర్థిక ఆంక్షలు విధించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించిన జాబితాలో రవాణా సంస్థ కమాజ్, షిప్పింగ్ కంపెనీలు (SEVMASH), యునైటెడ్ షిప్‌ బిల్డింగ్ కార్పొరేషన్ వంటి రక్షణ – సంబంధిత సంస్థలు ఉన్నాయి. రష్యన్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 80శాతం ఉత్పత్తికి బాధ్యత వహించే ఎలక్ట్రానిక్ విభాగం కంపెనీ రూసెల్ ఎలక్ట్రానిక్స్ కు ఆంక్షలు విస్తరిస్తాయి. ప్రపంచంలోని అతిపెద్ద రవాణా సంస్థల్లో ఒకటి, రష్యాకు అతిపెద్ద సింగిల్ కంట్రిబ్యూటర్‌లలో ఒకటైన రష్యన్ రైల్వేలను కూడా ఆస్ట్రేలియా లక్ష్యంగా చేసుకుంది.

russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు తన మద్దతును పునరుద్ఘాటిస్తూనే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రష్యా ప్రభుత్వానికి ఆర్థిక ఆంక్షలను విధిస్తూ రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో రష్యా “ప్రత్యేక సైనిక ఆపరేషన్”ను ప్రారంభించింది. రష్యా తీరును నిరసిస్తూ ఇప్పటికే అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి.

ట్రెండింగ్ వార్తలు