China Govt Policy : అగ్రరాజ్యాన్నే ఐ డోంట్ కేర్ అనే చైనా..ఆ ఒక్క విషయంలో మాత్రం హడలిపోతోంది..

అగ్రరాజ్యాన్నే ఐ డోంట్ కేర్ అనే చైనా..ఆ ఒక్క విషయంలో మాత్రం హడలిపోతోంది. సొంతంగా ఓ కృత్రిమ సూర్యుడిని చంద్రుడిని కూడా తయారు చేసిన చైనా అంతర్గత సమస్యతో తలమునకలవుతోంది.

China Govt Policy: అగ్రరాజ్యం అమెరికా అంటే అన్ని దేశాలు భయపడతాయి. కానీ డ్రాగన్ దేశం అయిన చైనా మాత్రం అగ్రరాజ్యమా? అదెలా ఉంటుంది? ఆహా అమెరికానా? అయితే మాకేంటీ ఐడోంట్ కేర్ అంటుందీ కమ్యూనిస్టు దేశం. అటువంటి చైనా గత కొంతకాలం నుంచి అంతర్గత సమస్యలతో అతలాకుతలం అయిపోతోంది. ఆగమాగం అవుతోంది. టెక్నాలజీతో ప్రపంచ దేశాలను ఆకర్షించి అబ్బురపరుస్తున్న చైనా ఏకంగా సొంతంగా ఓ కృత్రిమ సూర్యుడిని తయారు చేసి ఔరా అనిపించింది. ఎవ్వరు ఏమనుకున్నా..తాను అనుకున్నదే చేసి చూపించే చైనా మాత్రం జనాభా పెంచే విషయంలో మాత్రం బొక్కబోర్లా పడుతోంది.

సాధారణంగా చైనా అంటూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.కానీ ఇప్పుడా దేశం గత కొంతకాలంగా జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. అంటే జననాల నిష్పత్తి తగ్గిపోయి దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. పిల్లల్ని కనండిరా బాబూ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసినా ఏమాత్రం లెక్కచేయట్లేదు జనాలు. దీంతో ఎన్నో ఆఫర్లు కూడా ప్రకటించింది దేశ ప్రభుత్వం. అయినా ఏమాత్రం ఫలితం లేదు. ఒకప్పుడు ఒక్కే ముద్దు రెండో బిడ్డ వద్దు అన్న చైనా తరువాత ఇద్దరు బిడ్డలు చాలు మూడో బిడ్డ వద్దు అని చెప్పింది.

Also read : China`s population policy: ముగ్గురు పిల్లలను కనడానికి చైనా అనుమతి

కానీ దేశంలోవృద్ధుల సంఖ్య పెరిగిపోవటంతో ముగ్గురు బిడ్డలు ముద్దు అనే నినాదం అందుకుంది. ముగ్గురు పిల్లల్ని కనమని చెబుతోంది. నజరానాలు ప్రకటించింది.కానీ ఫలిత శూన్యం..దీంతో ప్రభుత్వం ఆగమాగం అవుతోంది. పిల్లల్ని కనటం మాట పక్కన పెడితే అసలు పెళ్లి చేసుకోవటానికే ఆసక్తి చూపించట్లేదు చైనా యువత. దీంతో పెళ్లిళ్లు చేసుకోమని..పిలల్ని కనమని పదే పదే చెబుతున్నా యువత ఏమాత్రం ఖాతరు చేయట్లేదు.

టెక్నాలజీలోను..అభివృద్ధిలోనే ప్రపంచ దేశాలకే ఛాలెంజ్ విసురుతున్న చైనా..జనాభా కొరత విషయంలో మాత్రం తెగ భయపడిపోతోంది. అది కూడా ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్యగా మారిపోయింది. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు ముప్పు తిప్పలు పడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా.. తగ్గుతున్న జనాభా కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం జనాభాను పెంచేందుకు ఎన్నెన్నో చర్యలు తీసుకుంటోంది.

Also read : China population crisis :చైనాలో పెరిగిపోతున్న‘బ్యాచిలర్స్’..పెళ్లి అంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు..

పాత చైల్డ్ పాలసీని తొలగించి కొత్త చైల్డ్ పాలసీని తీసుకువచ్చింది. అయినా..పెద్దగా మార్పు లేదని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ జనాభా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు.. చైనా ప్రభుత్వం సరికొత్త పథకాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు, బహుమతులు ప్రకటిస్తోంది. పెళ్లి చేసుకోండి.. ఎంతమంది అంటే అంతమంది పిల్లల్ని కనండి అంటూ ఎంకరేజ్ చేస్తోంది.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ప్రచురించిన బ్లాగ్‌లో..CPFA (సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ ఫారిన్ అఫైర్స్) ప్రెసిడెంట్ ఫాబియన్ బౌసార్ట్ మాట్లాడుతూ.. ‘‘చైనా బేబీ బోనస్‌లు, ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు, పన్ను తగ్గింపులు, పిల్లల పెంపకం రాయితీలను ప్రోత్సాహకాలుగా అందిస్తోంది. వివిధ సంస్థల ద్వారా ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నారు చైనా అధికారులు. బీజింగ్ డబినాంగ్ టెక్నాలజీ గ్రూప్ తన ఉద్యోగులకు 90,000 యువాన్లు వరకు నగదు ప్రోత్సాహకం, 12 నెలల ప్రసూతి సెలవులు, 9 రోజుల ప్రత్యేక సెలవులు కూడా ఇస్తోంది. పిల్లల్ని కనటానికి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు కూడా ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Also read : Marriage, Birth Loans : పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లోన్లు ఇస్తున్న బ్యాంకులు 

అవేంటంటే..గర్భిణీ స్త్రీలు, గర్భంలో బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేక సబ్సిడీలు ప్రకటిస్తున్నాయి. కంపెనీ నిర్వాహకులకు సబ్సిడీ ఇస్తున్నారని వరల్డ్ మీడియా చెబుతోంది. ఆగస్టులో నూతన జనాభా, కుటుంబ నియంత్రణ చట్టం ఆమోదించబడినప్పనుంచీ చైనాలో 20కు పైగా రాష్ట్రాలు, ప్రాంతాలు ప్రసవానికి సంబంధించిన నియమాలను సవరించాయి. బీజింగ్, సిచువాన్, జియాంగ్జితో సహా అనేక ప్రాంతాలు అనేక సహాయక చర్యలను ప్రకటించాయి. వీటిలో పితృత్వ సెలవు, ప్రసూతి సెలవుల పొడిగింపు, వివాహానికి సెలవు, పితృత్వ సెలవుల పొడిగింపు వంటివి ఉన్నాయి.

అయినా ఏమాత్రం ఫలితాలు లేవు. చైనా జనాభా వరుసగా ఐదో సంవత్సరం కూడా తగ్గింది. గత సంవత్సరం చివరి నాటికి చైనా జనాభా 1.4126 బిలియన్లు. ఇది అర మిలియన్ కంటే తక్కువ (చైనా జనాభా జనన రేటు ప్రకారంగా చూస్తే) పెరిగింది. జననాల రేటు వరుసగా ఐదవ సంవత్సరం కూడా జనాభా భారీగా క్షీణించినట్లుగా నమోదు అయ్యింది. ఈ గణాంకాలు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన చైనాకు జనాభాపరమైన ముప్పేనంటున్నాయి. అది ఆర్థిక ముప్పుగా మారే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) ప్రకారం.. చైనాలో జనాభా 2020లో 1.4120 బిలియన్ల నుండి 2021 చివరి నాటికి 1.4126 బిలియన్లకు పెరిగింది. చైనా జనాభా 2020లో 10.6 మిలియన్లతో పోలిస్తే ఒక సంవత్సరంలో 480,000 మాత్రమే పెరిగింది.

Also read : China’s New Law : చైనాలో కొత్త చట్టం…పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష!

జనానాల రేటు తగ్గిపోవటంతో చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. దీని వల్ల యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధ జనాభా పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపడమే అవుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇటువంటి పరిస్థితి దేశ ఆర్థిక పురోగతిని నిరోధిస్తుంది. ఒక దేశం వృద్ధి చెందాలంటే.. పనిచేసే మానవ వనరులు అత్యంత కీలకం. కానీ చైనాలో యువత కంటే, వృద్ధుల సంఖ్య పెరగుతోంది. అంటే దేశం ఆర్థికంగా నష్టపోవడం ఖాయం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Also read : Parents selling children : పిల్లల్ని కనటం అమ్మటం..అదే భార్యాభర్తల వ్యాపారం

ప్రభుత్వం నుంచి పింఛన్లు, ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని అలవెన్సులు తీసుకుంటున్న వృద్ధుల జనాభా పెరుగడం వల్ల ప్రభుత్వంపై భారమే పడుతోంది తప్ప.. ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోంది. చైనా జనాభా వృద్ధాప్యం అవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ లేదా దేశ అభివృద్ధికి తీవ్ర ముప్పే. అందుకే యువత పెళ్లి చేసుకోవాలని, ఎక్కువ పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అయినా యువత మాత్రం నో ఇంట్రెస్ట్ అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు