China balloon: చైనా స్పై బెలూన్ నిఘాలో ఇండియా.. మరిన్ని దేశాలు కూడా! అమెరికా నివేదిక ఏం చెప్పిందంటే..

చైనా బెలూన్ల అంశంపై ఇప్పుడు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా, జపాన్‌తోపాటు 40 దేశాలు చైనా స్పై బెలూన్ నిఘాలో ఉన్నాయి.

China balloon: చైనాకు చెందిన స్పై బెలూన్లు అమెరికా గగనతలంపై ఎగిరితే అమెరికా పేల్చేసిన సంగతి తెలిసిందే. దీంతో చైనా బెలూన్ల అంశంపై ఇప్పుడు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి.

Zoom Layoffs: ఉద్యోగాలకు కోత పెడుతున్న జూమ్.. 1300 మందిని తొలగించేందుకు సిద్దం

దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా, జపాన్‌తోపాటు 40 దేశాలు చైనా స్పై బెలూన్ నిఘాలో ఉన్నాయి. చైనా భారీ ఎత్తున నిఘా బెలూన్లను పంపించిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాలకు తెలియజేసినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. చైనా, దక్షిణ తీరంలోని హైనానా ప్రావిన్స్ నుంచి ఈ బెలూన్లను ఆపరేట్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ బెలూన్లు పని చేస్తున్నాయి. ఈ బెలూన్లు ఇండియా, జపాన్, వియత్నం, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాలపై నిఘా కొనసాగిస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన సైనిక సమాచారాన్ని తెలుసుకునేందుకు చైనా ఈ బెలూన్లు ఉపయోగిస్తోంది.

Gurugram Couple: దంపతులు కాదు.. రాక్షసులు! 14 ఏళ్ల బాలికను హింసించిన జంట.. ఇంట్లో పని చేయించుకుంటూ దారుణం

గుర్తు తెలియని రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ నివేదిక వెల్లడించినట్లు అమెరికా తెలిపింది. చైనా సైన్యమైన పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాల్లో భాగంగా, ఐదు ఖండాల్లో చైనా వీటిని ప్రయోగించింది. అనేక దేశాల గగనతలాల్లో ఈ బెలూన్లు ఎగరడం, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమేనని అమెరికా అభిప్రాయపడింది.

ట్రెండింగ్ వార్తలు