Pakistan Crisis: పాక్‌లో కిలో బియ్యం ధర ఎంతో తెలుసా..? ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ..

పాకిస్థాన్‌లో అధిక శాతం ప్రాంతాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. దీంతో వారు పస్తులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పాక్‌లో బియ్యం, పాలు, మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Pakistan Crisis: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలపై మరోసారి విద్యుత్ రేట్లు పెంచి మరింత భారాన్ని మోపింది. మరోవైపు ఆ దేశం విదేశీ మారకద్రవ్య నిల్వలు రెండున్నర బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వైపు చూస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం ఒక బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడంపై మౌనం వీడటం లేదు.

Pakistan Crisis : పతనం అంచున పాకిస్తాన్.. కేవలం 18రోజులకు సరిపడ విదేశీ మారకపు నిల్వలు

పాకిస్థాన్‌లో అధిక శాతం ప్రాంతాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. దీంతో వారు పస్తులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పాక్‌లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో బియ్యం ధర రూ.200 చేరింది. టీ ఆకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో టీ ఆకుల ధర రూ. 500 పెరిగింది. దీంతో ప్రస్తుతం వాటి ధర కిలో రూ. 1600 చేరింది. అయితే, టీ ఆకుల ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఉంది. ఇతర దేశాల నుంచి వీటి దిగుమతి జరుగుతుంది. గతంలోలా సరుకు ఓడరేవుకు చేరుకున్నప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో ఓడరేవులోనే నిలిపివేశారు. దీంతో దిమతి పూర్తిగాని నిలిచిపోవటంతో ధర భారీగా పెరిగింది.

Pakistan Economic Crisis: పాకిస్థాన్‌కు మరో తలనొప్పి.. భారీ జరిమానా చెల్లించాలంటున్న ఇరాన్ ..

పాకిస్థాన్‌లో కిలో పిండి రూ. 120, టమాటా కిలో రూ. 130కి చేరింది. కరాచీలో పాల ధరలు అమాంతం పెరిగాయి. పాలు లీటరు 210కి  చేరింది. బంగాళాదుంప కిలో రూ. 70కి చేరగా, పెట్రోల్ లీటర్ రూ. 250కి చేరింది. ప్రస్తుతం కిలో కోడి మాంసం ధర బోన్‌లెస్ రూ. 1000 నుంచి రూ. 1100 వరకు చేరింది. మరోవైపు పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 50ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1998 తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక మిగిలింది మూడు బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో ఒకనెల దిగుమతులను కూడా పాకిస్థాన్ భరించలేని పరిస్థితి ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు