Putin Tightens Security: కెర్చ్ వంతెనపై పేలుడు ఎఫెక్ట్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రత కట్టుదిట్టం.. పేలుడుకు కారణం ఎవరంటే?

కెర్చ్ బ్రిడ్జిపై పేలుడు సంభవించిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ పర్యటించే పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Putin Tightens Security: క్రిమియా ద్వీపకల్ప ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయడంలో, యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా తమ బలగాలకు ఆయుధాలను చేరవేయడంలో 19 కి.మీ పొడవైన కెర్చ్ వంతెన ఎంతో ముఖ్యమైనది. రైళ్లు, వాహనాల రాకపోకల కోసం నిర్మించిన జంట వారధి ఐరోపాలోనే అత్యంత పొడవైనది. సుమారు రూ.29వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ 2018లో ప్రారంభించారు. తాజాగా యుక్రెయిన్ పై రష్యా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ బ్రిడ్జిపై పేలుడు ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. బ్రిడ్జి కొంతభాగంకూలిపోయింది.

Crimea To Russia Connecting Bridge: రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై భారీ పేలుడు.. రైలుకు మంటలు వ్యాపించి చమురు ట్యాంకర్లు దగ్దం

రష్యా తమపై దాడిని ప్రారంభించినప్పటి నుంచీ రష్యా సేనలను అడ్డుకునే క్రమంలో కెర్చ్ బ్రిడ్జిని కూల్చివేయాలని యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఇదే విషయాన్ని యుక్రెయిన్ మిలిటరీ కమాండర్ ఒకరు గతంలో వెల్లడించారు. అయితే తాజాగా బ్రిడ్జిపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన యుక్రెయిన్ ఉగ్రవాద మనస్తత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని రష్యా చట్టసభ సభ్యులు కొందరు విమర్శిస్తున్నప్పటికీ యుక్రెయిన్ ను నిందిస్తూ మాస్కో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, బ్రిడ్జిపై వెళ్లే ప్రతీవాహనాన్ని అత్యాధునిక పరికరాలతో రష్యా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా పేలుడు సంభవించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బ్రిడ్జిపై పేలుడు సంభవించిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ పర్యటించే పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజా బాంబు పేలుడు వల్ల రష్యా సైన్యం యుక్రెయిన్ పై కొనసాగిస్తున్న ఎనిమిది నెలల యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్ యుక్రెయిన్‌లోని అన్ని రష్యన్ దళాలకు నాయకత్వం వహిస్తారని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు