Cute Video : ఇలాంటి వారు తోడుంటే..నెట్టింట వీడియో వైరల్

బుడ్డోడు ఆ చిన్నారిపై చూపిన ప్రేమ నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ..నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Harsh Mariwala Tweet : జీవితంలో మన బాగోగులు చూసేవారు ఉండాలని అందరూ కోరుకుంటుంటారు. తల్లిదండ్రుల తర్వాత..స్నేహితులు, బంధువులు ఆ ప్రేమను చూపిస్తుంటారు. కుటుంబంలో తల్లిదండ్రుల తర్వాత..అన్న కూడా వారిపై ప్రేమ చూపిస్తూ…బాగోగులు చూసుకుంటుంటారు. ఆడపిల్లల విషయానికి వస్తే..తమకు ఓ అన్న ఉండాలని కోరుకుంటుంది. చెల్లెళ్లు, తమ్ముల్ల బాగోగుల కోసం అన్నలు జీవితాలను త్యాగం చేసే వారుంటారు. ప్రస్తుతం ఓ బుడ్డోడు ఓ చిన్నారిపై చూపిన ప్రేమ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది.

Read More : Hut Collapsed : గుడిసె కూలి ఐదుగురు మృతి

తల్లిదండ్రుల మాదిరే..ఆ బుడ్డోడు ఆ చిన్నారిపై చూపిన ప్రేమ నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ..నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది. పారిశ్రామిక వేత్త, మారికో వ్యవస్థాపకుడు హార్ష్ మారివాలా తన ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. ఆ ప్రాంతం ఎక్కడుందో తెలియడం లేదు. ఆ వీడియోలో వర్షం పడుతుంటుంది. రోడ్డు మీద ఓ కారు ఆగి ఉంది. ఇంతలో ఓ పిల్లాడు బ్లాక్ టీ షర్టు, బ్లూ జీన్స్ వేసుకుని పరుగెత్తుకుంటూ వస్తుంటాడు. అయితే..ఆ పిల్లాడు టీ షర్టు లోపల ఓ పాప ఉంది. ఆ పాప తడవకుండా ఉండడం కోసం టీ షర్ట్ లోపల ఉంచాడు.

Read More : Heavy Rain : హైదరాబాద్‌ లో భారీ వర్షం… 23 సె.మీవర్షపాతం నమోదు

పరుగెత్తుకుంటూ..వచ్చి..కారులో కూర్చొన్న అనంతరం టీ షర్టు లోపల ఉన్న ఆ చిన్నారిని బయటకు తీశాడు. వెంటనే ఆ చిన్నారి ముసిముసి నవ్వులు నవ్వింది. చెదిరిన తలను సరి చేస్తాడు. పాపపై ఆ చిన్నారి చూపిన ప్రేమ, సంరక్షణ ప్రతొక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్షణాల్లో తెగ వైరల్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు