International Friendship Day: స్నేహం ఎంత చెడ్డదో తెలుసా? ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌ను నమ్మొద్దు

ఒక్కసారి ఆలోచించండి.. మద్యం తాగే అలవాటు ఉండని ఇంట్లో పుట్టిన పిల్లలకు ఆ అలవాటు ఎలా వస్తుంది?

Kinds Of Friends You Dont Need In Your Life

International Friendship Day – 2023: మనం ఎదిగినా, నాశనమై పోయినా దాని వెనుక స్నేహితులు ఉంటారని అంటారు. స్నేహితుల కోసం త్యాగాలు చేసేవారు ఉంటారు. నమ్మించి గొంతుకోస్తున్న స్నేహితులూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి.. మద్యం తాగే అలవాటు ఉండని ఇంట్లో పుట్టిన పిల్లలకు ఆ అలవాటు ఎలా వస్తుంది?

మద్యం, పొగ తాగని వాడు మొగాడే కాదని రెచ్చగొట్టి స్నేహితుడిని ఆ ఊబిలోకిలాగే స్నేహితులే సమాజంలో అధికంగా ఉన్నారు. ఇల్లు, కాలేజీ తప్ప మరేమీ తెలియని కొందరు విద్యార్థులు కొన్నాళ్ల తర్వాత ప్లబ్బులకు వెళ్లే అలవాటు ఎలా చేసుకుంటున్నారు? ఇక ఆన్‌లైన్‌లో పరిచయమవుతున్న స్నేహితులు చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కాదు. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని అంటారు. చెడ్డ స్నేహం విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.

అన్ని చెడు అలవాట్లూ స్నేహితుల వల్లే అంటుకుంటాయని పెద్దలు చెబుతుంటారు. ఇంతేనా.. వ్యాపారంలో మోసం చేసే స్నేహితులు.. అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని చంపిన ఫ్రెండ్.. స్నేహితుడి వద్ద ఉన్న డబ్బును తీసుకుని మాయమైన మిత్రుడు.. స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి.. వంటి వార్తలు మనం చదువుతూనే ఉంటాం.

స్నేహం ముసుగులో అమ్మాయిలకు వల వేసే అబ్బాయిలు, అబ్బాయిలకు వల వేసే అమ్మాయిలూ ఉన్నారు. అవసరాలు తీరాక అన్యాయంగా వదిలేస్తారు. ఇందులో బలయ్యేది మంచి వ్యక్తే. స్నేహంలో మంచే కాదు.. చెడూ ఉంటుంది. ఈ కాలంలో ఈ చెడు మరీ ఎక్కువ. ప్రాణ స్నేహితుడు అనుకున్న వాడే ప్రాణాలు తీసిన ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగుచూశాయి.

ఉదాహరణకు..
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన షకీబ్, గౌసుద్దీన్ స్నేహితులు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో మద్యం తాగి, ఏదో అనుకుని కొట్టుకున్నారు. మద్యం మత్తులో షకీబ్‌ను గౌసుద్దీన్ చంపేశాడు.

తెలంగాణలోని కొత్తగూడెం త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. బడికెల సందీప్‌, పల్లం సాయికుమార్‌ అనే యువకులు ప్రాణ స్నేహితులు. సిగరెట్ కొనుక్కుని వచ్చాక ఓ విషయంలో గొడవ పడ్డారు. సందీప్‌ పై సాయి కుమార్‌ సిమెంట్‌ ఇటుకతో దాడి చేసి చంపాడు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హరి కుమార్, కిషోర్ స్నేహితులు. ఈ ఏడాది ఏప్రిల్ 23న తమ అభిమాన హీరోల గురించి గొడవపడ్డారు. కిషోర్ ను హరికుమార్ సెంట్రింగ్ కర్రతో కొట్టాడు. దీంతో కిషోర్ ప్రాణాలు కోల్పోయాడు.

హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము ప్రేమిస్తున్న అమ్మాయి కోసం కొట్టుకున్నారు నవీన్, హరి అనే ఇద్దరు స్నేహితులు. న‌వీన్‌ను అక్కడే చంపాడు హ‌రి.

ఇటువంటి ఫ్రెండ్స్‌ని నమ్మొద్దు..
1. కొందరు స్నేహితులు వారి పనుల కోసం మిమ్మల్ని రమ్మంటారు. మీకు అవసరం వచ్చినప్పుడు వారు మీ వద్దకు మాత్రం రారు. మీ వ్యక్తిగత విషయాలు, సమస్యలు చెబితే మిమ్మల్ని ఎగతాళి చేసే స్నేహితులకు దూరంగా ఉండాలి.

2. కొందరు స్నేహితులు మీతో కేవలం డబ్బు కోసమే స్నేహం చేస్తారు.. స్నేహం చేస్తున్నట్లు నటిస్తారు

3. మద్యం తాగే అలవాటు, అప్పులు చేసే, బెట్టింగులు పెట్టే అలవాట్లు ఉండే స్నేహితులను నమ్మొద్దు

4. మీ సమయాన్ని వృథా చేస్తున్న వారితో స్నేహం వద్దు

5. ఎన్నో ఏళ్లుగా మీతో స్నేహం చేస్తున్నప్పటికీ మిమ్మల్ని నమ్మని వారితో స్నేహం వద్దు

6. మీరు చేసిన చిన్న తప్పుల్ని మర్చిపోకుండా, క్షమించకుండా మిమ్మల్ని ద్వేషిస్తున్న వారితో స్నేహం వద్దు

7. చదువు, వ్యాపారం ఇతర అంశాల్లో మీతో అనారోగ్య పోటీ పడుతున్న వారితో ఫ్రెండ్‌షిప్ వద్దు

8. స్నేహితులను మీ ఆర్థిక వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలి

Boyfriend Killed Girlfriend : పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. వేగంగా వెళ్తున్న లారీ కిందికి తోసేసి హతమార్చిన ప్రియుడు

International Friendship Day: స్నేహ బంధం గురించి తెలుసుకోవాలని ఉందా?

ట్రెండింగ్ వార్తలు