China Corona Cases : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు..!

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా విలయం తాండవం చేస్తోంది. బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని సడలించిన తర్వాత కేసులు భారీగా నమోదవుతున్నాయి.

China Corona Cases : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా విలయం తాండవం చేస్తోంది. బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని సడలించిన తర్వాత కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెరగడానికి కారణం బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్. రానున్న రోజుల్లో చైనాలో పరిస్థితులు మరింత దిగజారవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు సంభవించే ప్రమాదముందని లండన్ కు చెందిన ఎయిర్ ఫినిటీ లిమిటెడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జనవరిలో రోజుకు గరిష్టంగా 37 లక్షల కేసులు నమోదు కావచ్చని మార్చి నెల నాటికి 42 లక్షలకు పెరుగవచ్చని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవంగా నమోదవుతున్న కేసులకు భారీ తేడా ఉందని పేర్కొంది. చైనాలో బుధవారం 2,966 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని, వైరస్ బారినపడి 10 మంది మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది.

Coronavirus Updates: చైనాలోనే కాదు.. జపాన్‌లోనూ కరోనా విజృంభణ.. 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికేసులంటే?

కరోనా ఉధృతి కారణంగా ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా స్మశాన వాటికల్లో కరోనా మృతుల అంత్యక్రియలు చేయడం కూడా గగనమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. దేశంలో మాస్ టెస్టింగ్ బూత్ లను ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రజలు ఇంటి వద్దనే కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని ఎయిర్ ఫినిటీ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు