MERS- Coronavirus : అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనావైరస్ పాజిటివ్ కేసు

అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు తాజాగా వెలుగుచూసింది. ఒమన్ సరిహద్దులోని అబుదాబిలోని ఒక నగరంలో 28 ఏళ్ల యువకుడికి ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది....

MERS-Coronavirus

MERS- Coronavirus Case : అబుదాబీ (Abudhabi)లో ప్రాణాంతకమైన మెర్స్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు తాజాగా వెలుగుచూసింది. ఒమన్ (Oman) సరిహద్దులోని అబుదాబిలోని ఒక నగరంలో 28 ఏళ్ల యువకుడికి ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (MERS-CoV) సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. (Man Tests Positive For MERS-Coronavirus) అల్ ఐన్ (Abu Dhabi) నగరానికి చెందిన ఓ వ్యక్తి మెర్స్ కరోనా వైరస్ వ్యాధితో గత నెలలో ఆసుపత్రిలో చేరినట్లు డబ్ల్యూహెచ్ఓ (WHO) ఒక ప్రకటనలో తెలిపింది.

Twitter: ట్విట్టర్‌.. ఇకపై X.. పేరు మార్పు

రోగికి  కాంటాక్ట్‌లో ఉన్న 108 మందిని ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఇప్పటివరకు సెకండరీ ఇన్‌ఫెక్షన్లు ఏవీ రాలేదని పరీక్షల్లో వెల్లడైంది. జ్వరం, దగ్గు, శ్వాస ఆడక పోవడం మెర్స్ కొవిడ్ రోగి లక్షణం. ఈ వ్యాధి కొన్ని సందర్భాల్లో న్యుమోనియాకు దారి తీయవచ్చునని వైద్యనిపుణులు చెప్పారు. గతంలో మెర్స్ కరోనా వైరస్ వల్ల 936 మంది రోగులు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు