ఈ సంచలన విషయాన్ని 8 నెలల ముందే చెప్పిన వివేక్ రామస్వామి.. చెప్పింది చెప్పినట్లే జరిగింది..
Viral Video: పోటీ చేయనని జో బైడెన్ ఆదివారం అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
- T Venkateshwarlu
- Published on- July 22, 2024 / 09:00 PM IST
Vivek Ramaswamy
రాధేశ్యామ్ సినిమాలో హీరో ప్రభాస్ పేరు మోసిన జ్యోతిషుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అతడి అంచనాలు 100 శాతం నిజమవుతుంటాయి. భారత సంతతి బిజినెస్‌మన్, అమెరికా రాజకీయ నేత వివేక్ రామస్వామి జ్యోతిష్యుడు కాకపోయినప్పటికీ ఓ విషయాన్ని ఊహించి చెప్పారు.
ఆయన అంచనా 100 శాతం నిజం కావడంతో దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు చాలామంది ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని ఎనిమిది నెలల క్రితమే వివేక్ రామస్వామి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
తాను పోటీ చేయనని జో బైడెన్ ఆదివారం అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇదే విషయాన్ని ఎనిమిది నెలల క్రితం చెప్పిన వీడియోను వివేక్ రామస్వామి ఇప్పుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏదైనా చేయాలని ప్రేరేపించే మన మనస్తత్వాన్ని ఫాలో అవ్వడమే భవిష్యత్తును అంచనా వేయడానికి ఉన్న ఉత్తమ మార్గమని రాసుకొచ్చారు. ఎలాన్ మస్క్ కూడా వివేక్ రామస్వామి వేసిన అంచనాపై స్పందిస్తూ అప్పటి వీడియోను షేర్ చేశారు. ‘ఆయన అంచనాలన్నీ నిజమయ్యాయి’ అని పేర్కొన్నారు.
Also Read: మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్.. బెంగళూరు టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ!
