మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్.. బెంగళూరు టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ!

బెంగళూరు టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సానుభూతి వ్యక్తం చేస్తే, మరికొందరు ఆశ్చర్యం ప్రకటించారు.

మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్.. బెంగళూరు టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ!

Bengaluru techie turned weekends as auto driver to strike loneliness

Bengaluru techie: ఒంటరితనం మనుషులను బాగా ఇబ్బంది పెడుతుంది. లోన్లీనెస్ నుంచి బయటపడడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒంటరితనాన్ని జయించడానికి బెంగళూరులో ఓ టెకీ వైరటీ మార్గం ఎంచుకున్నాడు. మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఓ వ్యక్తి వీకెండ్స్‌లో ఆటో నడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఈ విషయాన్ని వెంకటేష్ గుప్త అనే వ్యక్తి ఎక్స్‌లో వెల్లడించారు.

“కోరమంగళలోని మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి వారాంతాల్లో ఆటో నడపుతున్నాడని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముఖం కనిపించకుండా అతడి ఫొటోను కూడా షేర్ చేశారు. మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హుడీ ధరించి అతడు ఫొటోలో కనిపించాడు. కాగా, దీనిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సానుభూతి వ్యక్తం చేస్తే, మరికొందరు ఆశ్చర్యం ప్రకటించారు.

“టెక్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ లో ఒంటరితనం పెరుగుతోందనేది నిశ్శబ్ద వాస్తవం. అత్యంత అధునాతన టెక్నాలజీ కూడా కొన్నిసార్లు హ్యుమన్ ఇంటారాక్షన్‌ను భర్తీచేయలేద”ని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. “అత్యంత ఒత్తడితో కూడిన జాబుల్లో పనిచేసే వారు మానసిక ఆరోగ్యం కాపాడుకోడం చాలా ముఖ్యం. ఇతర వ్యాపకాలతో మనసుకు రిలాక్సేషన్ దొరుకుంది. మా ఆఫీసులో ఒక ఇంజనీర్ విశ్రాంతి తీసుకోవడానికి బార్టెండర్‌గా పని చేస్తాడ”ని మరొకరు వెల్లడించారు.

టెకీలు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం కొత్త విషయం ఏమీ కాదని, డబ్బుల విషయం పక్కనపెడితే బెంగళూరు ట్రాఫిక్‌లో ఆటో నడిపితే రిలాక్సేషన్ ఎలా దొరుకుతుందని మరో నెటిజన్ ప్రశ్నించారు. అన్నింటినీ కనెక్ట్ చేసి, ప్రపంచాన్ని ఒంటరి చేసిన సాంకేతిక పరిజ్ఞానం చీకటి కోణానికి ఇది నిదర్శనమని ఇంకొరు వ్యాఖ్యానించారు.

Also Read: ఇలాంటి నాన్న ఉంటే.. పిల్లలు ఏదైనా సాధించగలరు.. ఈ అమ్మాయే రుజువు!

”ఆటోలు/డ్రైవింగ్ టాక్సీలు నడపడం మంచి వ్యాపకం. నేను విదేశాలలో వ్యాపారాలను నిర్వహించే పలువురు వ్యక్తులను కలుసుకున్నాను. అయితే వారు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఉబెర్‌ను నడుపుతున్నారు. డబ్బు కోసం కాదు.. డ్రైవింగ్ అంటే ఇష్టం, కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుందన్న భావనతో ఇలా చేస్తార”ని నెటిజన్ ఒకరు వెల్లడించారు.