Syed Ahmad Shah Saadat : ఒకప్పుడు అప్ఘాన్ మంత్రి.. ఇప్పుడేమో పిజ్జా డెలివరీ బాయ్‌..!

ఒకప్పుడు అప్ఘాన్ ఐటీశాఖ మంత్రిగా ఉన్న సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌.. పిజ్జా కంపెనీ యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పిజ్జాలు డెలివరీ చేస్తున్నాడు.

Syed Ahmad Shah Saadat delivers pizza : అప్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాలిబన్లదే రాజ్యం.. వాళ్లు చెప్పిందే శాసనం.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు అప్ఘాన్ ఐటీశాఖ మంత్రిగా ఉన్న (Syed Ahmad Shah Saadat ) ఇప్పుడేమో పిజ్జా డెలివరీ బాయ్‌గా మారిపోయారు. జర్మనీలోని వీధుల్లో ఆయన పిజ్జాలను డెలివరీ చేస్తు పొట్టబోసుకుంటున్నారు. తన కుటుంబ పోషణ కోసం పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు. ఆయనే అఫ్ఘానిస్తాన్‌ ఐటీ శాఖ మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌. జర్మనీలోని లీప్‌జిగ్‌ (Leipzig)లో సాదాసీదా జీవితం గడిపేస్తున్నారు.

ఇటీవల పిజ్జా కంపెనీ యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పిజ్జాలు డెలివరీ చేస్తుండగా.. అక్కడి స్థానిక జర్నలిస్టు ఒకరు ఫొటో తీశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రితం అప్ఘాన్ ఐటీశాఖ మంత్రిగా పనిచేసిన సయ్యద్ ను కొన్నిరోజుల క్రితమే కలిసినట్టు స్థానిక జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఇప్పుడేం చేస్తున్నారని అడిగితే.. తాను లీప్ జిగ్ సిటీలో పిజ్జా డెలివరీ చేస్తున్నానని చెప్పడంతో షాక్ అయ్యారట..
World Bank : అప్ఘానిస్తాన్‌కు నిధులు నిలిపేసిన ప్రపంచ బ్యాంకు

2018లో అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సయ్యద్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల పాటు ఐటీ శాఖ మంత్రిగా సయ్యద్ పనిచేశారు. ఆ తర్వాత 2020లో ఆయన రాజీనామా చేశారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ లో జర్మనీకి ఫ్యామిలీతో షిఫ్ట్ అయి అక్కడే స్థిరపడ్డారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన సయ్యద్.. కుటుంబాన్ని పోషించేందుకు పిజ్జాలను డెలివరీ చేసే జాబ్ లో జాయిన్ అయ్యారు.

ఒకప్పుడు మంత్రిగా చేసాననేది లేకుండా పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి సైకిలుపై పిజ్జాలను డెలివరీ చేస్తున్నాడు. సాదత్.. రెండు మాస్టర్ డిగ్రీలు సాధించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లో డిగ్రీలు పొందారు. ప్రస్తుత అప్ఘాన్ పరిస్థితులపై సాదత్ ను ప్రశ్నించగా.. ఘనీ ప్రభుత్వం ఇంత తొందరగా కూలిపోతుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు