Pakistan To Ukraine Supply Arms : యుక్రెయిన్‌కు పాకిస్థాన్ ఆయుధ సహాయం..సముద్ర మార్గంలో పంపనున్న పాక్

శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు.పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. భారత్-రష్యా మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయటానికి సిద్ధపడింది.

Pakistan To Ukraine Supply Arms : శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు.పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. భారత్-రష్యా మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయటానికి సిద్ధపడింది.  ఈ ఈ విషయంపై ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ రష్యాల మధ్య బంధం పెరుగుతుండడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పేర్కొంది. కరాచీలోని పోర్టు నుంచి యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న యూరోపియన్ దేశంలోని పోర్టుకు సముద్రమార్గం ద్వారా మోర్టార్లు, రాకెట్ లాంచర్లను పాకిస్థాన్ పంపనుందని తెలిపింది.

కాగా చమురు విషయంలో భారత్‌కు ఇచ్చినట్లే తమకూ డిస్కౌంట్ ఇవ్వాలని రస్యాను కోరింది పాకిస్థాన్. కానీ రష్యా దీనికి అంగీకరించలేదు. నో చెప్పేసింది. ఈ నిర్ణయంతో రష్యా భారత్ పాకిస్థాన్ తమ దృష్టిలో ఒకటి కాదనే సంకేతాలిచ్చినట్లైంది. దీన్ని బహుశా పాక్ భరించలేకపోతోంది. ఓ పక్క భారత్ పై పగతో ఎప్పుడు రగిలిపోతుంటుంది పాక్. మరోపక్క భారత్ కుచేసిన సహాయం తమకు చేయటంలేదనే అసహనం వెరసి పాక్ రష్యాను ఎదిరించే యుక్రెయిన్ కు సహాయం చేయటానికి సిద్ధపడింది. యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాయి. చాలా దేశాలు ఈ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. కానీ రష్యాతో భారత్ మాత్రం ఆయిల్ కొనుగోలు విషయాలో పాశ్యాత్య దేశాల నిర్ణయాన్ని తోసిపుచ్చింది. రష్యానుంచి చమురు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని రష్యా కూడా భారత్ కు తక్కువ ధరకే చమురు సరఫరా చేసింది. దీంతో పాకిస్థాన్ కూడా తమ మంత్రుల్ని రష్యా పంపించి భారత్ కు ఇచ్చినట్లే చమురు అమ్మకాల్లో తక్కువ ధరకు ఇవ్వాలని కోరింది.కానీ రష్యా దానికి నో చెప్పింది.దీంతో పాక్ తన సహజమైన కుటిల బుద్ధిని మరోసారి బయటపెడుతూ రష్యాను ఎదిరించే యుక్రెయిన్ కు ఆయుధ సహాయం చేయటానికి సిద్ధపడింది.

Russia-Pakistan : చమురు విషయంలో భారత్‌కు ఇచ్చినట్లే తమకూ డిస్కౌంట్ ఇవ్వాలని కోరిన పాక్.. కుదరదని చెప్పిన రష్యా..

సముద్ర మార్గం గుండా ఆయుధాలను పంపించాలని పాక్ నిర్ణయించుకుందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. దానికి ప్రతిగా తమ మిలటరీలోని ఎంఐ-17 హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేసుకునేందుకు యుక్రెయిన్ కంపెనీ నుంచి సహాయం పొందాలని పాక్ ప్రభుత్వ భావిస్తున్నట్లు వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్. మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రి..వంటి ఆయుధాలను యుక్రెయిన్ కు పంపించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తోందని..యుక్రెయిన్ పక్కనే ఉన్న యురోపియన్ యూనియన్ దేశానికి ఈ ఆయుధాలను చేర్చనుందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.

కాగా యుక్రెయిన్ పాకిస్థాన్ ల మధ్య చాలాకాలంగా మిలటరీ, వాణిజ్యాల విషయంలో మంచి లావాదేవీలు కొనసాగుతున్నాయి. 1991 నుంచి 2020 వరకు దాదాపు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను పాక్ యుక్రెయిన్ నుంచి కొనుగోలు చేసింది. దీంట్లో యుక్రెయిన్ తయారు చేసిన T-80 UD యుద్ధ ట్యాంకులు 320 కి పైగా ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతల్ని కూడా యుక్రెయినే చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ పాకిస్థాన్ దేశాల మధ్య అండర్ స్టాండింగ్ బాగానే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Russia-Ukraine war.. Indai Benefit : భారత్‌కు కలిసొచ్చిన రష్యా-యుక్రెయిన్ యుద్ధం .. రష్యా నుంచి చమురు దిగుమతులతో రూ. 35వేల కోట్లు ఆదా

 

 

ట్రెండింగ్ వార్తలు