Russia-Ukraine War : యుద్ధం ఆపాలంటూ పుతిన్‌కు హాలీవుడ్ టెర్మినేటర్ స్టార్ విజ్ఞప్తి!

Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం దీటుగా పోరాడుతోంది. యుక్రెయిన్ స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తోంది.

Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం దీటుగా పోరాడుతోంది. యుక్రెయిన్ దేశాన్ని ఎలాగైన స్వాధీనం చేసుకోవాలని రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. సైనిక చర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టి మారణహోమం సృష్టిస్తోంది. మొదట యుక్రెయిన్ బలగాలపై దాడులు చేసిన రష్యా.. ఇప్పుడు యుక్రెయిన్ పౌరులు, వారి నివాసాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. రష్యా యుద్ధం చేస్తున్న తీరును ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రష్యా చర్యలను సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు సైతం రష్యా చర్యలను తప్పుబడుతున్నారు. తాజాగా హాలీవుడ్ లెజెండ్ ఆర్నల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ (Arnold Schwarzenegger) కూడా స్పందించారు. ఇప్పటికైనా యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హాలీవుడ్ నటుడు ఆర్నల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా రష్యా చర్యలను వ్యతిరికేస్తూ ఆర్నల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ట్వీట్ చేశారు. ఈ హాలీవుడ్ లెజెండ్ చేసిన వీడియో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పుతిన్ వెంటనే యుద్ధం ఆపేయాలని కోరారు.

తాను మాట్లాడేది అందరూ శ్రద్ధగా వినాలని వీడియోలో ష్వార్జ్‌నెగ్గర్ రష్యా ప్రజలను కోరారు. మరోవైపు.. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 65 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యులయ్యార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేస్తోంది. ప్రపంచంలో జ‌రిగే విష‌యాలు మీకు తెలియ‌కుండా దాచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆ భ‌యాన‌క విష‌యాలను మీరు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న‌త‌నంలోనే ర‌ష్య‌న్ హెవీవెయిట్ లిఫ్ట‌ర్ యూరీ వ్లాసోవ్ తో తాను ఎలా స్పూర్తిని పొందారో వీడియోలో ష్వార్జ్‌నెగ్గర్ చెప్పుకొచ్చారు.

రష్యన్ల బలంతో పాటు వారి హృదయం చాలా మంచిదని, అదే తనకు స్పూర్తిని కలిగించేలా చేసిందన్నారు. యుక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న తీరును రష్యా ప్రజలు తప్పక తెలుసుకోవాలని సూచించారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో 141 దేశాలు ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఓటు వేశాయనే విషయాన్ని గుర్తుచేశారు. పుతిన్ ఈ యుద్ధానికి నాయ‌క‌త్వం వహించిన మీరు మాత్రమే ఈ మారణహోమాన్ని ఆపగలరని ఆర్నల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అభ్యర్థించారు.

Read Also : Russia-Ukraine War:‘మీరు టిక్ టాక్ స్టార్ కదా’..యుక్రెయిన్ అధ్యక్షుడిని ప్రశ్నించిన యువతి..జెలెన్ స్కీ ఏమన్నారోతెలుసా?!

ట్రెండింగ్ వార్తలు