Russia – Ukraine War: ‘సుమీలో విద్యార్థుల గురించి ఆందోళనగా ఉంది’

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యుక్రెయిస్ సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల.

Russia – Ukraine War: యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యుక్రెయిస్ సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తోంది. ఇప్పటివరకూ 50 విమానాల్లో యుక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారత్‌కు 11వేల మంది భారతీయులు చేరుకున్నారు. ఇంకా తీసుకురావాల్సిన విద్యార్థులు ఉండిపోవడంతో తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే యుక్రెయిన్‌ సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పట్ల తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అన్నారు. ‘విద్యార్థుల తరలింపు కోసం సురక్షితమైన కారిడార్‌ను రూపొందించడానికి తక్షణ కాల్పుల విరమణ పాటించాలని రష్యా, యుక్రెయిన్ ప్రభుత్వాలపై బహుళ మార్గాల ద్వారా ఒత్తిడి పెంచాం. విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని, షెల్టర్‌లలోనే ఉండాలని, అనవసరమైన ప్రమాదాలను నివారించాలని సూచించాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబార కార్యాలయాలు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నాయి’ అని పేర్కొన్నారు.

ఖర్కివ్, సుమీలో సుమారు వెయ్యి మంది భారతీయులు చిక్కుకున్నారు వారిని సేఫ్‌గా భారత్ కు తరలించేందుకు కేంద్రం అన్ని ఏర్పాటు చేస్తోంది. శనివారం (మార్చి 5) కూడా యుక్రెయిన్ సరిహద్దుల నుంచి భారత్‌కు మరో 15 విమానాలు చేరుకోనున్నాయి. ఇందులో 11 పౌర విమానాలు ఉండగా.. నాలుగు వాయుసేన విమానాలు ఉన్నాయి. మొత్తంగా యుక్రెయిన్ నుంచి 2,200 మంది భారతీయులు విమానాల్లో స్వదేశానికి చేరుకోనున్నారు.

Read Also : రష్యా-యుక్రెయిన్ బోర్డర్ లోని సుమిలో చిక్కుకున్న 1000మంది భారత్ విద్యార్ధులు

ఈశాన్య యుక్రెయిన్‌ ప్రాంతమైన సుమీ నగరం చాలా చిన్నది. తూర్పున రష్యా సరిహద్దుల్లో సమీపంలో ఈ సుమీ నగరం ఉంది. దీనికి 50 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సరిహద్దు ఉంది. సుమీ నగరానికి పశ్చిమాన 1200 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో పోలండ్, హంగరీ, రొమానియా సరిహద్దులు ఉన్నాయి. సుమీ, ఖార్కీవ్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వీలైనంత తొందరగా రష్యాకు చేరవేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు