Anchor Ravi Says Interesting Facts about his Life and Career
Anchor Ravi : యాంకర్ రవి.. టాలీవుడ్ పాపులర్ యాంకర్స్ లో రవి ఒకరు. దాదాపు పదేళ్లకు పైగా యాంకరింగ్ చేస్తూనే ఉన్నాడు. గతంలో సమ్‌థింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ళా మజాకా.. లాంటి పలు టీవీ షోలతో ఫుల్ ఎనర్జిటిక్ గా యాంకరింగ్ చేసి బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అన్ని ఛానల్స్ లో అనేక రకాల టీవీ షోలు చేసి మెప్పించాడు. ప్రస్తుతం ఒకటి, రెండు టీవీ షోలు, ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
తాజాగా యాంకర్ రవి ఓ రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోకి గెస్ట్ గా వచ్చి తన లైఫ్ గురించి, తన లైఫ్ లో వివాదాలు, ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. అసలు కొరియోగ్రాఫ్ గా పనిచేసే రవి యాంకర్ ఎలా అయ్యాడు అని తెలిపాడు.
Also Read : Allu Arjun : నాకు పార్టీలతో సంబంధం లేదు.. శిల్పా రవి కోసమే వచ్చాను.. ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్..
యాంకర్ రవి మాట్లాడుతూ.. చిరంజీవిలా పెద్ద హీరో అయిపోవాలని ఇండస్ట్రీకి వచ్చాను. మొదట నేను కొరియోగ్రాఫర్ గా పనిచేసే వాడ్ని. కొరియోగ్రాఫర్ గా సాఫ్ట్ వేర్ వాళ్లకి, ప్రైవేట్ పార్టీలకు, లేడీస్ పార్టీలకు వెళ్లి అక్కడ వాళ్ళకి డ్యాన్స్ లు నేర్పించడం, డ్యాన్స్ చేయడం చేసేవాడ్ని. అలా అమల గారికి పరిచయం ఆ తర్వాత నాగార్జున(Nagarjuna) గారు పరిచయం అయ్యారు. నాగార్జున గారితో ఇలా హీరో అవ్వాలి, పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పాను. నా ఎనర్జీ చూసి ఆయన మా మ్యూజిక్ ఛానల్ సమ్‌థింగ్ స్పెషల్ షోకి యాంకర్ గా చేశారు. అక్కడ్నుంచి నా కెరీర్ యాంకర్ గా మొదలైంది. ఆ తర్వాత లైఫ్ మీద రియలైజేషన్ వచ్చి చిరంజీవిలా అవ్వలేము కానీ మనకి ఫేమ్ రావాలి, గుర్తింపు రావాలి అని అనుకున్నాను. దాని కోసం ఆ సమ్‌థింగ్ స్పెషల్ షోని ఇంకా స్పెషల్ ఏం చేయాలి అని కొత్తగా ట్రై చేసి, లేడీ యాంకర్ ని తీసుకొచ్చి ఆ షోని పెద్ద హిట్ చేసాం అని తెలిపాడు.