Russia-Ukraine war : ‘బతికే ఒక్కరోజైనా హ్యాపీగా ఉందాం’ యుద్ధభూమి ఉక్రెయిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వేలాది జంటలు!

మరుభూమిగా మారిన యుక్రెయన్ లో ఓ పక్క బాంబుల మోత..మరోపక్క వివాహాల సందడి. ఐదు నెలలుగా యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్న దారుణ పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్ వాసులు తాము చనిపోతామేమో అనే భయాన్ని వదిలి ఉన్నన్ని రోజులైన సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనలు రూపమో యుద్ధభూమిగా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న యుక్రెయిన్ లో వేలాదిమంది జంటలు వివాహాలు చేసుకుని ఒక్కటవుతున్నారు.

4,000 couples have been married during in Ukraine : మరుభూమిగా మారిన యుక్రెయన్ లో ఓ పక్క బాంబుల మోత..మరోపక్క వివాహాల సందడి. ఐదు నెలలుగా యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్న దారుణ పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్ వాసులు తాము చనిపోతామేమో అనే భయాన్ని వదిలి ఉన్నన్ని రోజులైన సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనలు రూపమో యుద్ధభూమిగా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న యుక్రెయిన్ లో వేలాదిమంది జంటలు వివాహాలు చేసుకుని ఒక్కటవుతున్నారు. వివాహం జరిగే సమయంలోనే ఎటునుంచి బాంబులు విరుచుకుపడతాయో అనే విపత్కర పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్ లో యువత ఉన్నంతకాలం అయినా కనీసం ఒక్కరోజు అయినా సరే ‘కలిసి ఉందాం..సంతోషంగా ఉందాం’అనే ఆలోచనతో యుద్ధభూమిలో వివాహాలు చేసుకుంటున్నారు. యుక్రెయిన్ రాజధాని కీవ్ లోనే 4,000 జంటలు వివాహం ద్వారా ఒక్కటయ్యారు.

Also read : Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం

అక్కడా ఇక్కడా అని లేదు..ఆ నగరం ఈ నగరం అని లేదు..యావత్ దేశం యుద్ధభూమిగా మారిన యుక్రెయిన్ లో ప్రతి రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ మిస్సైల్ పడుతుందో, బాంబుల వర్షం కురుస్తుందో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఒక రోజు గడిస్తే… ‘హమ్మయ్యా మన జీవితంలో మరో రోజు బతికాం’ అని అక్కడి ప్రజలు సంతోషించే దుర్భర స్థితి నెలకొంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంలా జీవిస్తున్నారు యుక్రెయిన్ వాసులు. రష్యా చేస్తున్న దండయాత్రతో అందాల యుక్రెయిన్ నామరూపాలు లేకుండా పోతోంది. యావత్ దేశం ఒక శ్మశానాన్ని తలపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ శవాలు చెల్లా చెదురుగా పడి కనిపిస్తున్నాయి.

రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్ వాసులు జీవించిన క్షణమైన సంతోషంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో జంటలు పెళ్లి చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో చస్తామో తెలియదు… బతికినన్నాళ్లు కలిసి సంతోషంగా బతుకుదామనే భావనతో వేలాది మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. యుక్రెయిన్ రాజధాని కీవ్ లోనే 4 వేల జంటలు పెళ్లి చేసుకున్నాయి. పరిస్థితులు చక్కబడితే కలిసి జీవనం కొనసాగిస్తామని… లేదంటే భార్యాభర్తలుగా కలిచి చనిపోతామని ఒక ప్రేమ జంట కేథరినా లైట్వినెంకో, ఇహోర్ జక్వాట్ స్కీ తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. కీవ్ లోని ఒక చర్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

మరోవైపు దరఖాస్తు చేసుకున్న అదే రోజు వివాహం చేసుకునేందుకు యుక్రెయిన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో అయితే దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది. ఇంకోవైపు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిన ఉక్రెయిన్ ప్రజలు కూడా స్వదేశానికి తిరిగొచ్చి వివాహబంధంతో ఒక్కటవుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు