Saudi Aid To Pak : పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించిన సౌదీ

అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది సౌదీ అరేబియా. పాకిస్తాన్​కు 4.2 బిలయన్​ డాలర్ల సాయం అందించనున్నట్లు సౌదీ అరేబియా

Saudi Aid To Pak అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది సౌదీ అరేబియా. పాకిస్తాన్​కు 4.2 బిలయన్​ డాలర్ల సాయం అందించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సాయంలో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బ్యాంకులో 3 బిలియన్ డాలర్లు డిపాజిట్ చేయనుంది సౌదీ. మరో 1.2 బిలియన్​ డాలర్లను ఈ ఏడాది పాకిస్తాన్ యొక్క ఆయిల్ ఉత్పత్తుల వాణిజ్యంపై ఫైనాన్స్ చేయనున్నట్లు సౌదీ ఫండ్ ఫర్ డెవలప్ మెంట్ మంగళవారం ప్రకటించింది.

కాగా,సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు సౌదీ రాజధాని రియాద్ లో జరిగిన మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్(MGI)సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశం వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ప్రిన్స్ సల్మాన్​తో సమావేశమై చర్చలు జరిపిన మరుసటి రోజే ఈ ప్రకటన వచ్చింది.

పాకిస్తాన్​కు 2018లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది సౌదీ. విదేశీ మారక నిల్వల కోసం మరో 3 బిలియన్​ డాలర్ల చమురు సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్ల 3 బిలియన్ డాలర్లలో 2 బిలియన్​ డాలర్లను తిరిగి వెనక్కి ఇచ్చేసింది పాక్. ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్​ ఖాన్ మూడు రోజుల సౌదీ పర్యటన అనంతరం సంబంధాలు మెరుగుపడ్డాయి.

తాజా సాయానికి గానూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్​ సల్మాన్​కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి ఆర్థిక ఇబ్బందులున్న కష్టకాలంలో ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలని ట్వీట్​ చేశారు. సౌదీ ఆర్థిక సాయంతో పాకిస్తాన్ రూపాయి కోలుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు శౌకత్​ తరిణ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, పొరుగు దేశం అఫ్గానిస్తాన్​కు డాలర్లు అక్రమంగా తరలిస్తుందనే కారణంతో పాకిస్తాన్ కరెన్సీ ఈ ఏడాది మే నుంచి 13.6శాతం పడిపోయింది.

ALSO READ CAATSA Sanctions : భారత్ పై “కాట్సా” ప్రయోగించవద్దు..బైడెన్ కు సెనెటర్లు లేఖ

ట్రెండింగ్ వార్తలు