Sneakers for horses : గుర్రాలకు నాడాలు కాదు బ్రాండెండ్ షూస్ .. ధర వింటే దిమ్మ తిరిగిపోద్ది

గుర్రాలకు నాడాలు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ గుర్రాలు షూ వేసుకోవటం ఎప్పుడైనా చూశారా..? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. గుర్రాలకూ స్నీకర్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి.

horsekickslex Sneakers for horses

horsekickslex Sneakers for horses.. : గుర్రాలకు నాడాలు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ గుర్రాలు షూ వేసుకోవటం ఎప్పుడైనా చూశారా..? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. గుర్రాలకూ స్నీకర్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. దౌడుతీసే గుర్రాలకు నాడాలు బిగిస్తారనే విషయమే తెలుసు గానీ షూస్ కూడా వేస్తారనే విషయం కాస్త విడ్డూరంగానే ఉంది.

గుర్రాలకు నాడాలు బిగించడం అంటే కాస్త హింసించినట్లే. అదే వాటికి షూ వేస్తే స్టైల్ గాను ఉంటుంది..వాటికి ఎటువంటి బాధ ఉండదు. ఈ స్నీకర్స్‌ (sneaker)వల్ల గుర్రాలకు నాడాల కొట్టాల్సిన అసవరం ఉండదంటున్నారు ప్రముఖ షూ సర్జన్, స్నీకర్స్‌ కాస్ట్యూమ్‌ స్పెషలిస్ట్‌ మార్కస్‌ ఫ్లాయిడ్ (Marcus Floyd)‌.

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండెడ్‌ స్నీకర్స్‌ లా ఉండే స్నీకర్స్‌ను ఫ్లాయిడ్ గుర్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. కెంటకీకి చెందిన షూ ఆర్టిస్ట్ ఫ్లాయిడ్ ‘హార్స్‌ కిక్స్‌'(Horse Kicks) పేరుతో ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభించారు. horsekickslex.com లో ఒక జత గుర్రానికి అనుకూలమైన షూలను కస్టమ్‌గా ఆర్డర్ చేయవచ్చు. ‘ఈజీ బూస్ట్ -350′(Yeezy Boost), ‘న్యూ బ్యాలెన్స్‌-650′(New Balance 650) పేరుతో గుర్రాల కోసం ఇటీవల రెండు అందమైన మోడల్స్‌లో కొత్త తరహా స్నీకర్స్‌ను కూడా విడుదల చేశారు.

Wife and Husband : రోజుకు రెండుస్లార్లు సారీలు చెబితేనే కాపురానికి వస్తా : భర్తకు భార్య వింత కండిషన్

గుర్రాల పాదాల సైజుకు తగినట్లుగా ఆర్డర్‌ చేసి తయారు చేయించుకోవచ్చు. వీటి ప్రారంభ ధర 1,200 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.లక్ష నుంచి ఉంటుంది. రేసుల్లో ఉపయోగించే కుర్రాల కోసం ఎంతోమంది షూస్ ఆర్డర్ చేస్తుంటారు. కాగా గుర్రాల కోసం అమ్మే షూలు అమ్మగా వచ్చిన నగదులో కొంత భాగాన్ని స్థానిక మైనార్జీ సంస్థలకు ఇచ్చే స్నీకర్ బాల్ లెక్స్ (Sneaker Ball Lex) అనే ఈవెంట్ కు విరాళంగా వెళుతుంది. ఈ గుర్రాల షూలను ఫ్లాయిడ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, @infinitekustomz లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీటిలో కొద్ది మోడల్స్‌ మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని డిజైన్స్, మోడల్స్‌తో పాటు లెగ్జింగ్టన్, కెంచూరీలలో ప్రత్యేక స్టోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు మార్కస్‌ తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు