ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్.. ఈ ఏడాదిలో 5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒకే రోజు 28 లక్షలు దాఖలు!

ITR Filing Last Date : ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. చివరి తేదీ తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను డిసెంబర్ 31, 2024లోగా ఫైల్ చేయవచ్చు. అయితే, జరిమానాలను భరించాల్సి ఉంటుంది.

ITR Filing Over 5 crore returns filed ( Image Source : Google )

ITR Filing : ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్‌లు) దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ శనివారం (జూలై 27) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. అంతరాయం లేకుండా సేవలను అందించాలని ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో ఐటీ డిపార్ట్‌మెంట్ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొంది. 2024 జూలై 26 వరకు ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం 5 కోట్లకు పైగా ఐటీఆర్స్ అందాయి.

Read Also : ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

8 శాతం గత ఏడాదిలో దాఖలు చేసిన ఐటీఆర్ల కన్నా కంటే సెంటు ఎక్కువ. జూలై 26న 28 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను నిర్వహించేందుకు ఇన్ఫోసిస్ డిపార్ట్‌మెంట్ టెక్నాలజీ పార్టనర్‌గా ఉందని పేర్కొంది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో 8.61 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. చివరి నిమిషంలో రిటర్న్స్ దాఖలు రద్దీని నివారించడానికి పన్ను చెల్లింపుదారులను ఆర్థిక సంవత్సంర 2024-25కి సంబంధించిన ఐటీఆర్‌లను త్వరగా ఫైల్ చేయాలని ఐటీ శాఖ కోరింది.

ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. చివరి తేదీ తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను డిసెంబర్ 31, 2024లోగా ఫైల్ చేయవచ్చు. అయితే, జరిమానాలను భరించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల ఆదాయ స్థాయిని బట్టి మారుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) రూ. 5 లక్షల కన్నా ఎక్కువ నికర పన్ను విధించదగిన ఆదాయం కలిగిన వ్యక్తులు ఆలస్యంగా రిటర్న్‌ను దాఖలు చేస్తే రూ. 5వేల వరకు జరిమానా విధించవచ్చు.

అయితే, రూ. 5 లక్షలు.. అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన పన్నుదారులు ఆలస్యంగా ఐటీఆర్‌ను దాఖలు చేసినందుకు గరిష్ట జరిమానా రూ. 1,000కి పరిమితం చేసింది. పన్ను విధించే ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కన్నా తక్కువగా ఉన్న వ్యక్తులు, రీఫండ్‌ను క్లెయిమ్ చేసేందుకు మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులు ఆలస్యంగా దాఖలు చేసినా ఎలాంటి జరిమానా ఉండదు. పన్ను విధించే ఆదాయ పరిమితి మినహాయింపులను వర్తించే ముందు స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది.

Read Also : ITR Filing Made Easy : ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ తెలుసా? ఇ-ఫైలింగ్ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమంటే?

ట్రెండింగ్ వార్తలు