3 రోజుల 14 గంటల్లో ప్రంపంచాన్ని చుట్టేసి గిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళ

  • Publish Date - November 20, 2020 / 12:41 PM IST

UAE woman Guinness world record travelling the world : మూడు రోజుల్లో ఎన్ని రాష్ట్రాలు తిరగ్గలం పోని జిల్లాలు అంతగా కాకుంటే గ్రామాలు ఎన్ని తిరగ్గలం చెప్పండీ..మహా అయితే ఓ రెండు మూడు రాష్ట్రాలు తిరగ్గలమేమో..కానీ ఓ మహిళ కేవలం మూడు రోజుల్లో ఏకంగా 208 దేశాలు చుట్టేసింది. అంటే ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ ఘనత సాధించిన ఆమె గిన్నీస్ రికార్డు సాధించింది. ఆమె యూఏఈకి చెందిన 21 ఏళ్ల’’డాక్టర్ ఖావ్లా అల్ రొమైతీ’’. డాక్టర్ ఖావ్లా కేవలం రోజుల్లో ప్రపంచంలోని 208 దేశాలు చుట్టేసి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది.



వివరాల్లోకి వెళితే..యూఏఈకి చెందిన డాక్టర్‌ ఖావ్లా అల్‌ రొమైతీ అనే మహిళకు గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాలనేది కల. దాని కోసం ఏం చేయాలా? అని ఆలోచించింది. దీంతో అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టేస్తే..రయ్ మంటూ దేశాల్ని చుట్టేసి తన కల సాకారం అవుతుందని అనుకుంది. దాని కోసం పక్కాగా ప్లాన్ వేసుకుంది. అలా ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచ యాత్ర మొదలు పెట్టింది. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీవద్ద యాత్రను విజయవంతంగా ముగించింది. భూమిపై ఉండే ఏడు ఖండాలను సునాయాసంగా చుట్టేసింది.




https://10tv.in/karnataka-online-fraudsters-cheating-soan-papidi-with-gold-chain-delivery-instead-of-smart-phone/
డాక్టర్‌ ఖావ్లా అల్‌ రొమైతీ 3 రోజుల 14 గంటల 46 నిమిషాల్లో 208 దేశాలను చుట్టేసింది. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టినందుకుగానూ ఆమె పేరు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. గురువారం గిన్నిస్‌ బుక్‌ వారు ఇచ్చిన సర్టిఫికేట్‌తో ఫొటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘నాకు గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అంటే ఎంతో ఆసక్తి. అందుకే ప్రపంచాన్ని చుట్టేశా.. గిన్నిస్‌ బుక్‌ సర్టిఫికేట్‌ అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేనని తన కల సాకారమైందని డాక్టర్‌ ఖావ్లా అల్‌ రొమైతీ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతూ తెలిపింది.




తను ఈ ఘనత సాధించటానికి తన కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఉందని తన స్నేహితులు నిరంతరం తనను మోటివేట్ చేస్తూ ప్రోత్సహించేవారని వారిచ్చిన ఎంకరేజ్ మెంట్ ఎన్నిటికీ మరచిపోలేనని తెలిపింది.




కాగా యూఏఈలో దాదాపు 200లకు పైగా జాతుల వారున్నారు. వారి దేశాలు సందర్శించి వారి సంస్కృతులు మరియు సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకున్నానని ఆమె తెలిపింది. కేవలం మూడు రోజుల్లో ఏడు ఖండాలు..208 దేశాలు తిరగటం చాలా గొప్ప విజయంగా తాను భావిస్తున్నానని ఖావ్లా తెలిపింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించిన ఘనతను పంచుకుంది.

కాగా..సాహిత్య అభిమానులకు జులెస్‌ వెర్న్‌ రాసిన అరౌండ్‌ ది వరల్డ్‌ 80 డేస్‌ అనే నవల గుర్తుంటే ఉంటుంది.. ఆ అడ్వెంచరస్‌ నవలను ముళ్లపూడి వెంకటరమణ 80 రోజులలో భూ ప్రదక్షణ పేరుతో తెలుగులో అనువదించిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో అయితే గ్లోబ్‌ను (ప్రపంచాన్ని) చుట్టిరావడానికి 80 రోజులు పట్టింది కానీ.. ఇప్పుడైతే మూడు రోజుల్లో చుట్టేయొచ్చు అని నిరూపించింది యూఏకీ చెందిన డాక్టర్ డాక్టర్‌ ఖావ్లా అల్‌ రొమైతీ.

ట్రెండింగ్ వార్తలు