Ulas family walks : అచ్చం ఆదిమానవుల్లా, ఈనాటికీ నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం ..

ఈ ఆధునిక సమాజంలో ఈనాటికి కొంతమంది జంతువుల్లా నాలుగు కాళ్లమీద నడుస్తున్నారనే విషయం తెలుసా..? మానవ జాతి నాగరికత సాధించినా వీరు మాత్రం ఈనాటికి నాలుగు కాళ్లమీదనే నడుస్తున్న వీరిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు.

Ulas family walks On Four legs

Turkey Family That Walks on All Fours : ఒకప్పుడు మనిషి నాలుగు కాళ్లతోనే నడిచేవాడు. రెండు కాళ్లు, రెండు చేతులమీదనే నడిచేవాడని చరిత్రలో చదువుకున్నాం. ఆదిమానవుడు నాలుగు కాళ్లమీద అంటే రెండు కాళ్లు, రెండు చేతులు నేలమీద ఆన్చి నడిచేవాడు. కానీ మానవ పరిణామ క్రమంలో మనిషి ముందు రెండు కాళ్లను చేతులుగా ఉపయోగించటం నేర్చుకున్నాడు. అలా రాను రాను వెనుక కాళ్లమీదనే నడవటం అలవాటు చేసుకున్నాడు.ఈ మార్పుకు చాలా కాలం పట్టింది. ఆ మార్పే మనిషికి..జంతువులకు మధ్య తేడాను తెచ్చి పెట్టింది. జంతువులన్నీ నాలుగు కాళ్లమీదనే నడుస్తాయి. కానీ ఒకప్పుడు జంతువులా నాలుగు కాళ్లమీద నడిచిన మనిషి రాను రాను రెండు కాళ్లమీదనే నడటం నేర్చుకున్నాడు. అలా మానవ పరిణామ క్రమంలో జరిగిన పెను మార్పులు ఆనాటి ఆధునిక జీవనానికి నాంది పలికాయి. ఒకప్పుడు మనిషి కూడా జంతువులా నాలుగు కాళ్లమీదనే ‘నడిచాడట’ అని చదువుకున్నాం.

కానీ ఈనాటికి కొంతమంది మనుషులు నాలుగు కాళ్లమీదనే అంటే ఆదిమానవుడు నడిచినట్లే నడుస్తున్నానే విషయం తెలుసా..? తెలిస్తే నిజంగానే ఆశ్చర్యం కలిగుతుంది. టర్కీలో ఈనాటికి ఓ కుటుంబంలో అందరు నాలుగు కాళ్లమీదనే అచ్చం ఆదిమానవుడు నడిచినట్లే నడుస్తున్నారు. ఈ విషయం తెలిసిన మానవ సమాజం (అభివృద్ధి చెందిన సమాజం)ఆశ్చర్యపోయింది. అలా వింతగా నాలుగు కాళ్లమీద నడిచే ఉలాస్ కుటుంబం (Ulas family)అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. టర్కీలోని ఈ ఉలాస్ కుటుంబం (Ulas family) గురించి ఆస్ట్రేలియా 60 నిమిషాలు డాక్యుమెంటరీ(Australia documentary)లో ప్రదర్శించింది. ఈ అసాధారణ లక్షణం ఇంతకు ముందు ‘ ది ఫామిలి దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్స్’(“The Family That Walks on All Fours”)లో నమోదు చేయబడింది.

Uttar Pradesh : ఒట్టి చేతులతో అండర్‌గ్రౌండ్‌లో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించిన వ్యక్తి ..

అలా నాగులు కాళ్లమీద నడిచే ఈ వింత కుటుంబం టర్కీ (Turkey)లోని ఓ కుగ్రామంలో నివసిస్తోంది. ఈ కుటుంబానికి (family) చెందిన వారు నడవడానికి రెండు చేతులు, కాళ్లు (family walks on all fours) ఉపయోగిస్తారు. నడిచే సమయంలో తల పైకెత్తి నడుస్తారు. వీరిని చూస్తుంటే మానవ నాగరికత తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలుస్తోంది. మానవ జాతి నాగరికత సాధించినా వీరు మాత్రం ఈనాటికి నాలుగు కాళ్లమీదనే నడుస్తున్నారు. వీరిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో శాస్త్రవేత్తలు ఈ పరిస్థితి అర్ధం కాక పరిశోధనలు చేశారు. అయితే ఇప్పుడు దాని వెనుక ఉన్న మిస్టరీని కనుగొన్నారు.

ఉలాస్ కుటుంబం (Ulas family) చాలా కాలం పాటు ప్రపంచం నుంచి ఒంటరిగా ఉంది. 2005 కి ముందు, ఈ కుటుంబం గురించి ప్రజలకు తెలియదు. అప్పుడు ఒక టర్కిష్ ప్రొఫెసర్ రాసిన ఆర్టికల్​ ఒక బ్రిటీష్ శాస్త్రవేత్త దృష్టికి వచ్చింది. అది చదివిన ఆ శాస్త్రవేత్తకు ఆశ్చర్యపోయారు.ఈ పేపర్‌లో ఉలాస్ (ulas) కుటుంబం గురించి వివరించారు. కుటుంబానికి యునర్ టాన్ సిండ్రోమ్ (Uner Tan Syndrome) ఉందని దాంట్లో పేర్కొన్నారు.

బ్యాక్‌వర్డ్ ఎవల్యూషన్ (Backward Evolution)సిద్ధాంతం ఇక్కడ నుంచి వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ కుటుంబం(Family) పై ఆసక్తి చూపడం ప్రారంభించారు. అప్పుడు అది జన్యుపరమైన సమస్య (A genetic problem) అని తేలింది. ఇందులో రెండు పాదాలు బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులు చేతులు, కాళ్ల సాయంతో నడవడానికి (family walks on all fours) ఇదే కారణమని తేల్చారు.

Ghoda Library : పర్వతాలు, మారుమూల గ్రామాల పిల్లల కోసం ‘గుర్రం లైబ్రరి’ ..

శాస్త్రవేత్తలు (Scientists) నివేదికలో చెప్పిన దాని ప్రకారం.. రెసిట్ మరియు హేటిస్ రెండు కాళ్లపై నడిచే ఇద్దరు వ్యక్తులు. కానీ అతని 19 మంది పిల్లలలో, ఐదుగురు చేతులు, కాళ్ళు ఉపయోగించి నడిచే వారు. ఇప్పుడు ఈ తోబుట్టువుల వయస్సు 25 నుండి 41 సంవత్సరాలు. వారు కూడా ప్రపంచం ముందుకు వచ్చారు. పూర్వం ప్రజలు వారిని చాలా హేళన చేసేవారు. గ్రామంలో నివసించడం వారికి కష్టంగా మారింది. ఉలాస్ కుటుంబానికి చెందిన ఈ పిల్లలు స్కూల్ ముఖం కూడా చూడలేకపోవటానికి కారణం అదేనంటారు.

ఈ వింత కుటుంబ గురించి ప్రొఫెసర్ హంఫ్రీ మాట్లాడుతు..నాలుగు కాళ్లపై నడిచేవారు చిన్న మెదడును కలిగి ఉంటారని అలా ఉన్నవారు అలా నాలుగు కాళ్లమీద నడుస్తారని అన్నారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో, నాలుగు కాళ్లపై నడిచే వారు సాధారణ మానవుల కంటే కోతుల మాదిరిగానే ఉంటారని కనుగొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు