Gun Firing in US school : అమెరికాలోని స్కూల్‌లో 15 ఏళ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్‌లో 15 ఏళ్ల అబ్బాయి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఎనిమిదిమంది గాయపడ్డారు.

3 dead in US school shooting : అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్‌లోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు, 14, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌‌కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న హైస్కూల్‌ క్లాసులు జరుగుతున్న సమయంలో మంగళవారం (నవంబర్ 30,2021) మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తి 15 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

Read more : Firing : అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రముఖ ర్యాపర్ మృతి

దుండగుడి కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిని 15 ఏళ్ల అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఓ సెమీ ఆటోమెటిక్ హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

Read more : Omicron : ఒమిక్రాన్ టెన్షన్.. ఇకపై 6గంటలు ఎయిర్ పోర్టులో వెయిట్ చేయాల్సిందే.. ప్రభుత్వం కొత్త రూల్

ఆడుతు పాడుతు స్కూలుకు వెళ్లిన తమ బిడ్డలు ఇలా చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా అమెరికాలు గన్ కల్చర్ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ఈక్రమంలో మరోసారి పేలిన ఘన్ తూటాలకు ముగ్గురు విద్యార్దులు బలైపోయారు.

 

ట్రెండింగ్ వార్తలు