US Special Team : యుక్రెయిన్-రష్యా వార్.. జెలెన్‌స్కీని రక్షించేందుకు రంగంలోకి అమెరికా

కీవ్‌ను రష్యా బలగాలు చేజిక్కించుకోకముందే జెలెన్‌స్కీని సురక్షితంగా దేశం దాటించాలని అమెరికా భావిస్తోంది. అయితే యుక్రెయిన్‌ను వదిలి వెళ్లేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా లేరు.

US special team : కీవ్‌ను ఏ క్షణమైనా రష్యా బలగాలు ఆక్రమించుకోనుండడంతో అమెరికా రంగంలోకి దిగింది. యుక్రెయిన్‌ను రక్షించుకునేందకు యుద్ధక్షేత్రంలోకి వీరోచితంగా పోరాడుతున్న జెలెన్‌స్కీని సురక్షితంగా తప్పించేందుకు బలగాలు తరలిస్తోంది. జెలెన్‌స్కీ రష్యాకు చిక్కితే.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని అమెరికా అనుమానిస్తోంది. కీవ్‌ను రష్యా బలగాలు చేజిక్కించుకోకముందే జెలెన్‌స్కీని సురక్షితంగా దేశం దాటించాలని అమెరికా భావిస్తోంది. అయితే యుక్రెయిన్‌ను వదిలి వెళ్లేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా లేరు. కీవ్‌లోనే ఉంటానని ఆయన తేల్చి చెప్తున్నారు.

అటు యుద్ధం మూడో రోజూ క్షిపణుల దాడులు, బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లూతూనే ఉంది. కీవ్ ఆక్రమణ ఇవాళ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. నిన్ననే రష్యా బలగాలు కీవ్‌లోకి ప్రవేశించినప్పటికీ.. యుక్రెయిన్ సైనికుల నుంచి, ఆయుధాలు పట్టుకున్న పౌరుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురయింది. అందుకే కీవ్ ఆక్రమణ ఆలస్యమయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రష్యా ఊహించినంత వేగంగా కీవ్‌ను ఆక్రమించుకోలేకపోయిందని భావిస్తున్నారు. అయితే కాస్త ఆలస్యమయినప్పటికీ ఏ క్షణమైనా కీవ్‌ మొత్తాన్ని రష్యాబలగాలు తమ గుప్పెట్లోకి తీసుకోనున్నాయి.

Indian Students : యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు.. నేడు రెండు ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో స్వదేశానికి విద్యార్థులు

యుక్రెయిన్‌-రష్యా మధ్య రెండోరోజు యుద్ధం మరింత భీకరంగా సాగింది. రష్యా ముప్పేట దాడులతో విరుచుకుపడింది. పలు నగరాలు, సైనిక స్థావరాలపై మూడు వైపుల నుంచి పదాతిదళాలు, యుద్ధట్యాంకులతో అటాక్ చేసింది. రాజధాని కీవ్‌, రెండో పెద్దనగరం ఖర్కివ్‌తో పాటు పలు పట్టణాల్లోకి ప్రవేశించిన పుతిన్‌ సేనలతో యుక్రెయిన్ బలగాలు ఉద్ధృతంగా పోరు సాగించాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి ప్రవేశించిన పుతిన్‌ సేనలు.. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల వైపు కదులుతున్నాయి. వారిని నిలువరించేందుకు ప్రజలకు ఆయుధాలిచ్చిన యుక్రెయిన్‌ సైన్యం… రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కీవ్‌, ఖర్కీవ్‌, ఒడెస్సా, మారియాపోల్‌ తదితర నగరాలతోపాటు నల్ల సముద్రం, నీపర్‌ నదికి అనుసంధానించే ఖెర్సాన్‌ ప్రాంతంపైనా దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు. యుక్రెయిన్‌ ఆర్థిక కార్యకలాపాలను కట్టడి చేసేలా… కీలకమైన ఒడెస్సా పోర్టుపైనా పట్టు బిగించాయి. మాస్కో బలగాలు రెండో రోజు తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరం నడిబొడ్డుకు చేరుకోవటంతోపాటు రెండో అతిపెద్ద నగరం ఖర్కివ్‌లోకి ప్రవేశించాయి.

Ukrainian Soldier : హీరోస్ ఆఫ్ యుక్రెయిన్.. ఏకంగా ఆరు రష్యా ఫైటర్‌ జెట్లను కూల్చాడు

యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఇప్పటికే అడుగుపెట్టిన రష్యన్ దళాలు.. ఇపుడు ఆ దేశంలో రెండో అతిపెద్ద పట్టణమైన ఖార్కివ్‌పై కన్నేశాయి. ఆ సిటీలోకి ఎంటరయ్యేందుకు బాంబు దాడులు చేశాయి. మిస్సైళ్ల వర్షం కురిపించాయి. వాహనాల్లో వెళ్తున్న వారి పక్కనుంచే రాకెట్లు దూసుకెళ్తున్నాయి. అంతేకాదు ఆ పట్టణంలోని నేషనల్ గార్డ్ అకాడమీకి సమీపంలో నడిరోడ్డుపై పడిపోయిన రాకెట్లు కనిపిస్తున్నాయి. ఖార్కివ్‌ను హస్తగతం చేసుకున్న రష్యా దళాలు…ఇప్పుడు సుమీ నగరం మీదుగా కదులుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు