Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

17వ శతాబ్దానికి చెందిన రెండు కళ్లజోళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. దుష్టశక్తులను పారద్రోలతాయని నమ్మే ఈ కళ్లజోళ్లను దక్కించుకోవటానికి బడా బడా వ్యాపారవేత్తలు..రెడీగా ఉన్నారు.

Two Goggles auction of the 17th century : వేలంలో కొన్ని వస్తువులు కోట్ల రూపాయలకు అమ్ముడవుతాయనే విషయం తెలిసిందే. కొన్ని సార్లు అత్యంత సాధారణమైనవి కూడా కోట్లాది రూపాయలకు అమ్ముడై రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాయి. వాటిలో కొన్ని పురాతనమైనవి కావటం..మరికొన్ని రాజ కుటుంబాలకు చెందివని కావటం కూడా అంత ధర పలుకుతుంటాయి. అటువంటివే రెండు కళ్లజోళ్లు వేలానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు కళ్లజోళ్ల ధరను రూ.25 కోట్లుగా నిర్ణయించారు నిర్వాహకులు.

రెండు కళ్లజోళ్ల చూడటానికి బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. కానీ ఇవి చాలా ప్రత్యేకమైనవి. 17వ శతాబ్దంలో తయారు చేసిన ఈ రెండు కళ్లజోళ్లను సాక్షాత్తూ మొఘల్ రాజకుటుంబీకులు వాడారు. ఈ కళ్లద్దాల ఫ్రేమ్‌లో పచ్చలు, వజ్రాలను అమర్చారు. అంతేకాదు..ఓ కళ్లజోడులోని తెల్లటి లెన్సును గోల్కొండలో వెలికి తీసిన 200 క్యారెట్ల వజ్రం నుంచి తయారు చేశారు. రెండో కళ్లజోడులోని లెన్సులను ఎమరాల్డ్ అంటే పచ్చతో తయారు చేశారు. వీటిని ఇంత ధర నిర్ణయించటానికి ఇవే కారణాలు కాదు. ఇటువంటి కళ్లజోళ్లు ఇప్పుడు తయారు చేసి అమ్మినా అంత ధర రాదు. కానీ ఈ రెండు కళ్లజోళ్లు మొఘల్ రాజకుటుంబీలు వాడినందుకు కూడా ఇంత ధర కాదు. మరేమింటంటే..

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ కళ్లజోళ్లకు కొన్ని మహిమలు ఉన్నాయని మొఘలులు భావించేవారట. ఆ భావనే వీటికి ఈ స్థాయి పాపులారిటీ రావడానికి కారణమని ప్రముఖ ఆక్షన్ సంస్థ సౌత్‌బీ హౌస్ తెలిపింది. వీటిని ధరించినా..ఇవి ఇంట్లో ఉన్నా..దుష్ట శక్తులు దరిచేరవని, పారలౌకిక జ్ఞానం (జ్ఞానం సంప్రాప్తిస్తుంది..లేదా జ్ఞానోదయాన్ని చేరుకోవడానికి) కూడా సిద్ధిస్తుందని మొఘల్ రాజకుటుంబీకులు నమ్మేవారు.

తెల్ల లెన్స్ కలిగిన కళ్లద్దాలను హేలో ఆఫ్ లైట్‌గా..ఆకుపచ్చ రంగు లెన్స్ ఉన్నవాటిని గేట్‌ వే ఆఫ్ పారడైజ్‌గా పిలుస్తారు. రానున్న అక్టోబర్ నెలలో సౌత్‌బీ ఆక్షన్ సంస్థ ఈ రెండు కళ్లజోళ్లను వేలం వేయనుంది. వీటి వేలం ద్వారా 3.5 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 25 కోట్లు పైనే వచ్చే అవకాశం ఉన్నట్టు సౌత్‌బీ హౌస్ అంచనా వేస్తోంది. ఇవి చాలా అరుదైనవని, ముఘల్ కాలంనాటి నైపుణ్యాలకు ఇవి ప్రతీకలని సౌత్‌బీ మధ్యప్రాచ్యం, ఇండియా విభాగం చైర్మన్ ఎడ్వర్డ్ గిబ్స్ వ్యాఖ్యానించారు.

Read more : Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్‌ ధర రూ. 7.5 కోట్లు

కాగా నమ్మకం మనిషిని ఏం చేయటానికైనా సిద్దం చేస్తుంది. మరి .దుష్ట శక్తులు దరిచేరవని, పారలౌకిక జ్ఞానం సంప్రాప్తిస్తుందని నమ్మకమున్న ఈ కళ్లజోళ్లకు అంతకంటే ఎక్కువ ధరే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు